Good news: క్యాన్సర్కోసం కొత్తరకం ట్రీట్మెంట్..మనోళ్లే కనుగొన్నారు..ఖర్చు చాలా తక్కువ

Good news: క్యాన్సర్కోసం కొత్తరకం ట్రీట్మెంట్..మనోళ్లే కనుగొన్నారు..ఖర్చు చాలా తక్కువ

క్యాన్సర్ రోగులకు గుడ్న్యూస్..క్యాన్సర్కు కొత్త రకం ట్రీట్మెంట్ వచ్చింది..ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబే , ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ పరిశోధకులు ఈ కొత్తరకం క్యాన్సర్ థెరపీని కనుగొన్నారు. దాదాపు12 యేళ్లుగా పరిశోధనలు జరిపిన అనంతరం  భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కార్-టి సెల్ థెరపీ అయిన NexCAR19 క్లినికల్ ట్రయల్ డేటాను మంగళవారం ( మార్చి18) ప్రచురించారు. 

కార్-టి సెల్ థెరపీ అని పిలువబడే ఈ రకం ట్రీట్మెంట్.. క్యాన్సర్ చికిత్సకు ఒక రకమైన ఇమ్యునోథెరపీ.ఇది క్యాన్సర్ కణాలను చంపేందుకు శరీర రోగనిరోధక కణాలను పెంచుతుంది. భారతదేశపు మొట్టమొదటి కార్-టి సెల్ థెరపీ 73శాతం సక్సెస్ రేటును చూపించిందని పరిశోధకులు వెల్లడించారు. 

అక్టోబర్ 2013లో క్యాన్సర్ చికిత్సకు తక్కువ ఖర్చు తో కూడిన కణ,జన్యు చికిత్సగా దీనిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదించింది.ఈ ప్రక్రియలో క్యాన్సర్ రోగి రక్తం నుంచి రోగనిరోధక వ్యవస్థ కణం అయిన T కణాలను సంగ్రహిస్తారు. వీటిని క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపడానికి మార్పు చేస్తారు. మాడిఫై చేయబడిన ఈ కణాలు తర్వాత భారీగా ఉత్పత్తి అవుతాయి. రోగి రక్తంలోకి తిరిగి పంపిస్తారు. తద్వారా అవి విస్తరించి పనిచేయడం మొదలుపెడతాయి. 

ఇది భారతదేశంలో క్యాన్సర్‌కు మొట్టమొదటి జన్యు చికిత్స.ఇది రోగులకు కొత్త ఆశను అందిస్తుందని ఈ చికిత్సను అభివృద్ధి చేయడంలో సహాయపడిన IIT-బాంబే నుంచి ప్రొఫెసర్ రాహుల్ పుర్వార్ చెప్పారు. ఇప్పుడున్న సాంప్రదాయ క్యాన్సర్ చికిత్సల మాదిరిగా కాకుండా CAR T-కణాలు శరీరంలో ఎక్కువ కాలం ఉండి. క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించడంలో సహాయపడతాయని టాటా మెమోరియల్ హాస్పిటల్ నుండి డాక్టర్ హస్ముఖ్ జైన్ చెబుతున్నారు. 

ఇందులో మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే తక్కువ ధరలకు అందుబాటులో ఉండటం.US వంటి దేశాలలో ఇలాంటి చికిత్సలకు $3,73,000 నుండి $4,75,000 (సుమారు రూ. 3-4 కోట్లు) వరకు ఖర్చవుతుంది.ఈ చికిత్స భారతీయ వెర్షన్ కేవలం రూ. 25 లక్షలకే లభిస్తుంది.ఇది ఇతర ప్రపంచ చికిత్సల ధరలో పదో వంతు కంటే తక్కువ.