Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!

Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!

Hydrogen Train: రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా దేశంలో త్వరలోనే  హైడ్రోజన్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలో భారతీయ  రైల్వే శాఖ డిసెంబర్ 2024లో భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలునుప్రారంభించబోతోంది.

ఈ హైడ్రోజన్ రైళ్లు ఎలాంటి డీజిల్ లేదా విద్యుత్ అవసరం లేకుండా నడుస్తాయి. పవర్ జెనరేట్ చెయ్యడానికి నీటిని ప్రాథమిక వనరుగా ఉపయోగించనున్నారు. అలాగే రైలుకి అవసరమైన విద్యుత్‌ను సైతం హైడ్రోజన్ ద్వారా తయారు చేసుకోవటం ఈ రైళ్ల స్పెషల్. హైడ్రోజన్ రైళ్లతో పొల్యూషన్ అస్సలు ఉండదు. డీజిల్, ఎలక్ట్రికల్ రైళ్ల కంటే కూడా జీరో పొల్యూషన్ తో నడుస్తాయి ఈ హైడ్రోజన్ రైళ్లు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రోజన్ రైళ్లను తీసుకొస్తున్నాయి ఆయా దేశాలు. అందులో భాగంగా.. ఇండియాలో మొదటి హైడ్రోన్ రైలు.. అతి తర్వాలో పట్టాలు ఎక్కబోతున్నది. 

ఈ హైడ్రోజన్ రైలు స్పీడ్ ఏ మాత్రం తక్కువ కాదు. టాప్ స్పీడ్ 140 కిలోమీటర్లు. హైడ్రోజన్ తో నడిచే రైళ్లతో జీరో పొల్యూషన్ ఉండటమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ అంటోంది. 

భారతదేశంలో మొదటి హైడ్రోజన్ రైలు.. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ స్టేషన్ల మధ్య దూరం 90 కిలోమీటర్లు. ఇప్పటికే ట్రయిల్ రన్ విజయవంతం అయ్యింది. ఈ స్టేషన్ల మధ్యనే కాకుండా.. డార్జిలింగ్, నీలగిరి మౌంటైన్, కల్కా.. సిమ్లా రైల్వే వంటి హిల్.. పర్వత ప్రాంతాలకు ఈ హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.  

హైడ్రోజన్ రైళ్ల ట్రయిల్ రన్ విజయవంతం కావటంతో.. 2024 డిసెంబర్ నెలలోనే అధికారికంగా మొదటి హైడ్రోజన్ రైలును పట్టాలెక్కనుంది. 2025లో 35 హైడ్రోజన్ రైళ్లు నడపాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.