దేశ తొలి స్వదేశీ ఎంఆర్ఐ మెషీన్

దేశ తొలి స్వదేశీ ఎంఆర్ఐ మెషీన్

మొదటి ఎంఆర్ఐ (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) మెషీన్ ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ మెషీన్​ ను ఢిల్లీలోని ఆల్​ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్సెస్(ఏయిమ్స్)లో ఇన్​స్టాల్ చేసి2025, అక్టోబర్ నుంచి ట్రయల్స్ నిర్వహించనున్నారు. 

ఇప్పటివరకు ఎంఆర్ఐ మిషన్లను, వాటికి సంబంధించిన విడిభాగాలను దాదాపు 80 నుంచి 85 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో వైద్య చికిత్సల ఖర్చులు పెరిగి ప్రజలపై భారం పడుతున్నది.

ALSO READ | దేశంలోనే మొట్టమొదటి ఫ్రోజెన్​ జూపార్క్ ఎక్కడుందో తెలుసా?
    
ఈ స్వదేశీ ఎంఆర్ఐ మెషీన్ వల్ల చికిత్స ఖర్చులు తగ్గనున్నాయి. ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. దీనిని ఎలక్ట్రానిక్స్ అండ్​ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ(ఎంఈఐటీవై) ఆధ్వర్యంలో పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ సొసైటీ ఫర్​ అప్లైడ్​ మైక్రోవేవ్​ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(ఎస్ఏఎంఈఈఆర్) అభివృద్ధి చేసింది.
    
ఈ ఎంఆర్ఐ మెషీన్ 2014లో ప్రారంభమైన నేషనల్ మిషన్​ ఎస్ సీఏఎన్–ఈఆర్ఏ(స్వదేశీ చుంబకియా అను–నాద్ చిత్రన్–ఏక్ రాష్ట్రీయ అభియాన్) కింద అభివృద్ధి చేశారు.