ఎల్బీనగర్ స్టేషన్లో ప్రారంభించిన మేయర్
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘మిట్టా ఎక్స్లెన్స్హెల్త్ క్లినిక్’ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మిట్టా ఎక్స్ లెన్స్ చైర్మన్ డా.మిట్టా శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణికులతోపాటు సమీప ప్రాంతాలవారు వైద్య సేవలను వినియోగించుకోవచ్చన్నారు. క్లినిక్‌లో ల్యాబ్, మెడికల్ షాప్, డాక్టర్లు ఇలా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
డా.మిట్టా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్లలోనూ క్లినిక్స్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ ఎనీమియా ముక్త భారత్ పిలుపులో భాగంగా తాము ఉచితంగా హిమోగ్లోబిన్ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. ఐ చెకప్, ఆడియోమెట్రీ లాంటి 21 టెస్టులను ఫ్రీగా చేయనున్నట్లు ప్రకటించారు. మిట్టా ఎక్స్ లెన్స్ డైరెక్టర్లు డాక్టర్ నిఖిల్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు.