దేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో

భూమిపై నడిచే మెట్రో చూశారు. ఫిల్లర్స్ తో ఎయిర్ లో మెట్రో ట్రైన్స్ నడవడం చూసిఉంటారు. కానీ రేపటి నుంచి నీటి అడుగున మెట్రో ట్రైన్ పరుగులు పెట్టండం చూస్తారు. అది కూడా ఎక్కడో కాదు మన ఇండియాలోనే. కలకత్తాలో హూగ్లీ నదీ ప్రవాహంలో 16.6 కి. మీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో నిర్ణాణం చేశారు. మార్చి 6న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. వెస్ట్ బెంగాల్ లో హౌరా, సాల్ట్ సరస్సులను కలుపుతున్న ఈ గొప్ప నిర్మాణం ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.

ALSO READ :- ఆ గుడికి  వెళితే కాశీ  వెళ్తే వచ్చేంత పుణ్యం వస్తుందట.. 

మొత్తం ఆరు మెట్రో స్టేషన్లో మూడు భూగర్భంలోనే నిర్మించారు. 16.6 కిలోమీటర్లలో 10.8 కిలోమీటర్లు హుగ్లీ నది కింద సొరంగంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వాటర్ మెట్రోలో ఆఫ్ కిలో మీటర్ 45 సెకన్లలో చేరుకోవచ్చు.