వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?

వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను కేంద్ర ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కిస్తోంది. టెక్నాలజీని వాడుకుంటూ రయ్యు రయ్యుమంటూ పరుగులు పెట్టే హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకోస్తోంది. ప్రయాణికులను వీలైనంత తక్కువ సమయంలో గమ్యాలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేలో వందే భారత్ ట్రైన్స్ తమ ప్రత్యేకతను చాటుకుంటుండగానే.. రైల్వే శాఖ మరో నయా మోడల్ ట్రైన్‎లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 

Also Read:-మెడికల్ అడ్మిషన్ల స్థానికతపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఫస్ట్ టైమ్ మెట్రో ట్రైన్‎ను ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును పట్టాలపై పరుగులు పెట్టించేందుకు రైల్వే శాఖ రెడీ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16 (సెప్టెంబర్)న ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ మెట్రో రైలును గ్రాండ్‎గా లాంఛ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ మెట్రో రైలు టైమింగ్స్ అండ్ ఫీచర్స్ ఇతర వివరాలును వెల్లడించారు. వందే భారత్ మెట్రో ట్రైన్ డిటెయిల్స్‎పై మీరు ఓ లుక్కేయండి. 

వందే భారత్ మెట్రో జర్నీ టైమ్:

రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఫస్ట్ మెట్రో ట్రైన్‏ను గుజరాత్‎లో పరుగులు పెట్టనుంది. వారానికి ఆరు రోజుల పాటు  గుజరాత్‎లోని భుజ్--= అహ్మదాబాద్ మార్గంలో ఈ ట్రైన్ నడవనుంది. రైలు భుజ్ నుండి ఉదయం 5:5 గంటలకు బయలుదేరి.. 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి 11:10 గంటలకు భుజ్ చేరుకుంటుంది.  ఈ రైలు మొత్తం 5 గంటల 45 నిమిషాలలో ప్రయాణాన్ని జర్నీని కంప్లీట్ చేస్తోంది. మొత్తం 9  స్టేషన్లలో 2 నిమిషాల పాటు హాల్టింగ్ తీసుకుంటుంది. 

మెట్రో డిజైన్ అండ్ ఫీచర్స్:

వందే భారత్ రైలు మాదిరిగానే ఈ వందే మెట్రో ట్రైన్ కూడా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్. 
స్టార్టింగ్ 12 కోచ్‎లతో ప్రారంభం కానున్న ఈ ట్రైన్‎ను ప్రయాణీకుల రద్దీ దృష్టా 16 కోచ్ ల వరకు విస్తరించవచ్చు. 
ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. 
ఆటోమేటిక్ డోర్లు ఈ రైలు ప్రత్యేకం
ఈ ట్రైన్ 100 కి.మీ నుండి 250 కి.మీల మధ్య పరిధిలో పరుగులు పెట్టగలిగేలా రూపొందిచారు.