ఇండియా విదేశీ అప్పులు రూ.59 లక్షల కోట్లు!

ఇండియా విదేశీ అప్పులు రూ.59 లక్షల కోట్లు!

న్యూఢిల్లీ: ఇండియా విదేశీ అప్పుల విలువ గత డిసెంబరు నాటికి 10.7 శాతం పెరిగి  717.9 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.59.82 లక్షల కోట్లు)చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2023లో ఇది  648.7 బిలియన్ డాలర్లు ఉండేది.  సెప్టెంబర్ 2024 చివరి నాటికి అప్పు మొత్తం సీక్వెన్షియల్​గా  712.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. 

డిసెంబర్ 2024 చివరి నాటికి జీడీపీలో విదేశీ అప్పు నిష్పత్తి 19.1 శాతంగా ఉంది. ఇది సెప్టెంబర్ 2024లో 19 శాతంగా ఉంది.   డాలర్ విలువలో మార్పులు వంటి వాటిని లెక్కలోకి తీసుకోకుండా చూస్తే, విదేశీ అప్పు గత మూడు నెలల్లో 17.9 బిలియన్ డాలర్లు పెరిగింది. డాలర్ విలువలో మార్పులు లెక్కలోకి తీసుకుంటే, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అప్పు 5.2 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది.