600 బిలియన్ డాలర్లు దాటిన ఫారెక్స్ నిల్వలు

600 బిలియన్ డాలర్లు దాటిన  ఫారెక్స్ నిల్వలు

న్యూఢిల్లీ: దేశ ఫారెక్స్ నిల్వలు గత 15 నెలల్లో మొదటి సారిగా 600 బిలియన్ డాలర్ల మార్క్‌‌ను టచ్‌‌ చేశాయి.  ఈ నెల14 తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్‌‌లు 12.74 బిలియన్ డాలర్లు పెరిగి 609.02 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. గత నాలుగు నెలల్లో ఒకే వారంలో ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి.  ఫారెన్‌‌ కరెన్సీ అసెట్స్‌‌ 11.2 బిలియన్ డాలర్లు పెరిగి 540.17 బిలియన్ డాలర్లకు, గోల్డ్ రిజర్వ్‌‌లు 1.14 బిలియన్ డాలర్లు ఎగిసి 45.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ నెల 7 తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.23 బిలియన్ డాలర్లు పెరిగి 596 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి.