
ముంబై: మనదేశ ఫారెక్స్ నిల్వలు గత నెల 28తో ముగిసిన వారంలో 1.781 బిలియన్ డాలర్లు తగ్గి 638.698 బిలియన్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. గత వారంలో మొత్తం ఫారెక్స్ నిల్వలు 4.758 బిలియన్ డాలర్ల పెరిగి 640.479 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2024 చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఫిబ్రవరి 28తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 493 మిలియన్ డాలర్లు తగ్గి 543.35 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఈ వారంలో బంగారం నిల్వల విలువ 1.304 బిలియన్ డాలర్లు తగ్గి 73.272 బిలియన్ డాలర్లకు తగ్గాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 27 మిలియన్ డాలర్లు పెరిగి 17.998 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్‌లో మనదేశ రిజర్వ్ స్థానం 12 మిలియన్ డాలర్లు తగ్గి 4.078 బిలియన్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.