India GDP: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..పదేళ్లలో జీడీపీ డబుల్

India GDP: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..పదేళ్లలో జీడీపీ డబుల్

భారతదేశ స్థూలజాతీయోత్పత్తి (GDP) డబుల్ అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ..2025నాటికి 4.3 ట్రలియన్ల డాలర్లకు చేరడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. పదేళ్లలో 105శాతం పెరుగుదలను చూసింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అపూర్వమైన వృద్ధిరేటు. 

అంతర్జాతయ ద్రవ్యనిధి (IMF) డేటా ప్రకారం..దశాబ్దకాలంలో భారత్ 77 శాతం వృద్దిని నమోదు చేసింది. 2015లో 2.4 ట్రిలియన్ల డాలర్ల నుంచి 2025లో 4.3 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ది భారత్ ను ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో చేర్చింది. 2025లో జపాన్‌ను అధిగమించి, 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉంది.

మరోవైపు చైనా పదేళ్లో 74 శాతం జిడిపి వృద్ధిని సాధించింది. 2015లో 11.2 ట్రిలియన్ల డాలర్ల నుంచి 2025లో 19.5 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అమెరికాను అధిగమించలేకపోయింది. కోవిడ్ మహమ్మారి,కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల నుంచి ఎదురు దెబ్బలతో చైనా అమెరికాను బీట్ చేయలేకపోయింది. 

ఇక అమెరికా ప్రపంచలోనే ఆర్థిక వ్యవస్థగా తన హోదాను నిలుపుకుంది. 2015లో అమెరికా జీడీపీ 23.7 ట్రిలియన్ల డాలర్లు ఉండగా.. 2025లో 30.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. ఇది పదేళ్లో 28శాతం వృద్ధి రేటును సూచిస్తుంది. ఇది   ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే నెమ్మదిగా వృద్దిరేటు ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక స్థిరత్వంలో యూఎస్ ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. 

ఇక UK, ఫ్రాన్స్, జర్మనీ ,జపాన్ వంటి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు పదేళ్లో 6శాతం నుంచి 14 శాతం వరకు జీడీపీ వృద్దిని సాధించాయి. ఈ ఆదేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిగా విస్తరణ జరిగినప్పటికీ  ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.

టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థలలో బ్రెజిల్ అత్యల్ప GDP వృద్ధిని నమోదు చేసింది, 2015లో 2.1 ట్రిలియన్ల డాలర్లు ఉన్న జీడీపీ 2025లో 2.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. ఇది కేవలం 8 శాతం పెరుగుదలమాత్రమే నమోదు చేసింది. 2014 లో వస్తువుల పతనంతో ఆ దేశ ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఇది దీర్ఘకాలిక మాంద్యానికి దారితీసింది. COVID-19 మహమ్మారి వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులతో  ఇది మరింత తీవ్రమైంది.