
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. గతంలో వేసిన అంచనా 6.7 శాతం నుంచి 6.3 శాతానికి సవరించింది. 2024–25 లో భారతదేశ వృద్ధి నిరాశపరిచిందని, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గడం, ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ నెమ్మదించడమే కారణమని ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. “వడ్డీ రేట్లు తగ్గడంతో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నా, పాలసీ దన్నుతో ఇండియా ఆర్థిక వ్యవస్థ మెరుగైన పొజిషన్‌లో ఉంటుంది”అని ప్రపంచ బ్యాంక్ వివరించింది. ఐఎంఎఫ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించింది.