
- ప్రపంచ బ్యాంకు అంచనా
న్యూఢిల్లీ:ఇండియా 2047 నాటికి సంపన్న దేశంగా మారాలంటే ఏటా 7.8 శాతం జీడీపీ గ్రోత్ సాధించాలని, ఇందుకోసం చాలా సంస్కరణలు తేవాలని ప్రపంచ బ్యాంకు రిపోర్టు పేర్కొంది. దీని ప్రకారం.. భూ సంస్కరణలను, కార్మిక సంస్కరణలను అమలు చేయాలి. జీఎన్‌ఐ పర్‌క్యాపిటా ఎనిమిది రెట్లు పెరగాలి. జీఎన్‌ఐ తలసరి అంటే ఒక దేశ స్థూల జాతీయ ఆదాయాన్ని ఆ దేశ మధ్య సంవత్సరం జనాభాతో భాగించగా వచ్చేది. అంటే, ఒక దేశంలోని ఒక్కో వ్యక్తి సగటు ఆదాయం ఎంత అని తెలుసుకోవచ్చు.
ఇండియా 2000 నుంచి 2024 వరకు ఏటా 6.3 శాతం వరకు గ్రోత్ సాధించింది. ఈ లెక్కన భవిష్యత్ టార్గెట్లనూ చేరుకోవడానికి అవకాశం ఉంది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారడానికి, ఇన్ఫ్రాను పెంచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. డిజిటైజేషన్‌ను, హ్యూమన్ క్యాపిటల్‌ను పెంచడానికీ చర్యలు తీసుకుంది.
గ్లోబల్ఎకానమీకి మరింత దగ్గర కావడం ద్వారా చిలీ, కొరియా, పోలండ్ వంటి దేశాలు మధ్య ఆదాయ దేశాల నుంచి సంపన్న దేశాలుగా మారాయని, వీటి నుంచి ఇండియా నేర్చుకోవాలని వరల్డ్‌బ్యాంక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అగస్టీ టనో అన్నారు.