దివాలా తీసిన గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌

దివాలా తీసిన గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: వాడియా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన బడ్జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ గో ఫస్ట్ దివాలా బాట పట్టింది.  కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీ), ఢిల్లీ  దగ్గర వాలంటరీ ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీ రిజల్యూషన్‌‌‌‌‌‌‌‌ను ఫైల్ చేసింది.  అప్పులు తీర్చడానికి, కార్యకలాపాలు కొనసాగించడానికి  ఫండ్స్ లేకపోవడంతో కంపెనీ దివాలా తీసినట్టు తెలుస్తోంది.  ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీ రూల్స్ ప్రకారం, కంపెనీ కార్యకలాపాలు లిక్విడేటర్ చేతికి వస్తాయి. కంపెనీని  ఎవరైనా కొనడానికి వస్తారేమో చూడాల్సి ఉంది. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ల కోసం  గత కొంత కాలంగా గో ఫస్ట్ వెతుకుతున్న విషయం తెలిసిందే.  రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీకి వెళ్లినట్టు కంపెనీకి అప్పులిచ్చిన వారికి తెలియదు. వీరు కంపెనీ ఫ్యూచర్ గురించి చర్చించేందుకు త్వరలో సమావేశం కానున్నారు.  ఈ ఇష్యూకి సంబంధించి ప్రభుత్వానికి రిపోర్ట్ చేశామని,  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కు డిటైల్డ్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను సబ్మిట్ చేస్తామని గో ఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోహ్నా పేర్కొన్నారు. కంపెనీకి డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ప్రాటీ అండ్ విట్నీ వలనే..

యూఎస్ కంపెనీ ప్రాటీ అండ్  విట్నీ  సప్లయ్ చేసిన ఇంజిన్లలో సమస్యలు తలెత్తడంతో తాము ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీకి వెళ్లాల్సి వచ్చిందని గో ఫస్ట్ ప్రకటించింది. ‘ప్యాటీ అండ్ విట్నీ సప్లయ్ చేసిన ఇంజిన్లలో లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి.  ఫలితంగా  25 విమానాలను (గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్‌‌‌‌‌‌‌‌ ఏ320 నియో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌లలో సగం) మే 1 నుంచి  గ్రౌండ్‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయాల్సి వచ్చింది. ఇంజిన్ల సమస్యతో  గ్రౌండ్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైన విమానాలలో  ప్రాట్నీ అండ్ విట్నీ ఇంజిన్ల వాటా  2019  డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 శాతంగా,  2020 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 31 శాతంగా ఉంది. 2022 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 50 శాతానికి పెరిగింది.  గత కొన్నేళ్ల నుంచి ఈ  కంపెనీ భరోసా ఇస్తున్నా, వీటిని నిలబెట్టుకోవడంలో ఫెయిలయ్యింది’ అని  గో ఫస్ట్ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  సింగపూర్  ఎమెర్జెన్సీ ఆర్బిటర్స్ ఇచ్చిన తీర్పును ఈ యూఎస్ కంపెనీ ఫాలో అయితే ఈ ఏడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ లేదా సెప్టెంబర్  నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను మొదలు పెడతామని వివరించింది.  పరిస్థితులు తమను ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌టీకి వెళ్లేలా చేశాయని పేర్కొంది. ‘ఎమెర్జెన్సీ ఆర్బిటర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రాటీ అండ్ విట్నీ తన దగ్గర ఉన్న ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా ఇంజిన్లను లీజుకి ఇవ్వాలి.   కానీ, ఇలా చేయడంలో ఈ కంపెనీ ఫెయిల్ అయ్యింది. రానున్న 3–4 నెలల్లో మరిన్నీ ఇంజిన్లు ఫెయిలవుతాయినే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గో ఫస్ట్ సరిగ్గా కార్యకలాపాలు కొనసాగించలేదు’ అని  కంపెనీ వెల్లడించింది.  గో ఫస్ట్  క్యాష్ అండ్ క్యారీ మోడ్‌‌‌‌‌‌‌‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఓ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి అన్నారు.  దీనర్ధం ఆపరేట్ చేయాలనుకునే ఫ్లయిట్ల బట్టి కంపెనీ రోజువారిగా పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్స్ చేయలేకపోతే వ్యాపారులు గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌తో తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను ఆపుకోవడానికి వీలుంటుంది.

ప్యాసింజర్లు ఏం చేయాలి?

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు బకాయిలు చెల్లించడంలో విఫలమవ్వడంతో  ఈ నెల 3, 4 తేదీలలో  విమాన సర్వీస్‌‌‌‌‌‌‌‌లను నిలిపివేస్తున్నామని గో ఫస్ట్ ప్రకటించింది. ఈ రెండు రోజుల కోసం గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌లో టికెట్స్ బుక్ చేసుకున్నవారు కంపెనీ దగ్గర తమ కాంటాక్ట్ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవాలి. సంబంధిత ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ను షేర్ చేయడానికి కంపెనీ ప్రతినిధులకు ఈజీగా ఉంటుంది.  డీజీసీఏ రూల్స్ ప్రకారం, ఫ్లయిట్స్ క్యాన్సిల్ అయితే కంపెనీలు  ఫుల్‌‌‌‌‌‌‌‌ రీఫండ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వస్తుంది. రెండు రోజులు సర్వీస్‌‌‌‌‌‌‌‌లు ఆగిపోవడంతో  55,000 – 60,000 మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారని అంచనా. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్లయిట్ బుక్ చేసుకోవడం కూడా ఖరీదుతో కూడుకున్నదే. మే 3 న  ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లే చౌకైన ఫ్లయిట్ సర్వీస్ కాస్ట్ రూ.10 వేల దగ్గర ఉంది. గో ఫస్ట్ ఈ ఏడాది మార్చిలో 8.95 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది.