వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు రిఫరీగా తెలుగు మహిళ

క్రైస్ట్‌చర్చ్‌లో ఆదివారం జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు భారత్‌కు చెందిన జీఎస్‌ లక్ష్మి మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనున్నారు. జీఎస్ లక్ష్మి పూర్తి పేరు గండికోట సర్వ లక్ష్మి. ఆమె ఆంధ్రప్రదేశ్‌‎లోని రాజమండ్రిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. లక్ష్మి మ్యాచ్ రిఫరీగా  గతంలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె 2020లో యూఏఈలో జరిగిన పురుషుల ప్రపంచకప్‌ లీగ్‌–2 మ్యాచ్‌లకు కూడా మ్యాచ్‌ రిఫరీగా సేవలందించారు. ఇక ఇప్పుడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగే టైటిల్‌ పోరుకు రిఫరీగా సేవలు అందించనున్నారు.

For More News..

చిల్లర రాజకీయాలు చేసేవాళ్లను అధిష్టానం చూసుకుంటది

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్