
పుణె: బిల్లీ జీన్ కింగ్ కప్ టెన్నిస్ టోర్నీలో ఇండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో ఇండియా 2–1 తేడాతో చైనీస్‌తైపీని ఓడించింది. తొలి మ్యాచ్‌లో వైదేహి చౌదరి 6–2, 5–7, 6–4తో ఫాంగ్ అన్ లిన్‌పై గెలిచింది. 2 గంటలా 9 నిమిసాల మ్యాచ్‌లో వైదేహి సర్వీస్‌ల్లో ఆకట్టుకుంది. రెండో సెట్ కోల్పోయినా మూడో సెట్‌లో అద్భుతంగా ఆడింది.
రెండో సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 6–2, 7–6 (7/3)తో జొన్నా గార్లాండ్‌ను ఓడించింది. గంటా 44 నిమిషాల మ్యాచ్‌లో తెలుగమ్మాయి రెండు సెట్లలోనూ జోరు చూపెట్టింది. బలమైన సర్వీస్‌లు, గ్రౌండ్ స్ట్రోక్స్‌తో రెచ్చిపోయింది. డబుల్స్‌లో అంకితా రైనా–ప్రార్థన తోంబరే 2–6, 6–4, 6–10తో యి సెన్ చో–ఫాంగ్ సీన్ వు చేతిలో ఓడారు. శనివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. కొరియాతో తలపడుతుంది.