భారీగా పెరిగిన నియామకాలు.. డిసెంబర్‌‌‌‌‌లో 31 శాతం వృద్ధి: ఫౌండిట్‌‌‌‌

భారీగా పెరిగిన నియామకాలు.. డిసెంబర్‌‌‌‌‌లో 31 శాతం వృద్ధి: ఫౌండిట్‌‌‌‌

న్యూఢిల్లీ: కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో నియామకాలు 31 శాతం పెరిగాయి. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌, కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, ఇంజనీరింగ్‌‌‌‌ సెక్టార్లలో నియామకాలు ఎక్కువగా జరిగాయని  ఆన్‌‌‌‌లైన్ జాబ్‌‌‌‌ పోర్టల్ ఫౌండిట్‌‌‌‌ పేర్కొంది. 

ఫౌండిట్‌‌‌‌ ఇన్‌‌‌‌సైట్‌‌‌‌ ట్రాకర్ (ఫిట్‌‌‌‌) ప్రకారం, ఇండియాలో గత ఆరు నెలల్లో హైరింగ్ యాక్టివిటీ 12 శాతం  పెరగగా, ఒక్క డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే 31 శాతం వృద్ధి నమోదైంది. 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 2024 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల నియామకాలు 60 శాతం పెరిగాయి. 

మాన్యుఫాక్చరింగ్ కంపెనీల నియామకాలు 57 శాతం, ఇంజనీరింగ్ కంపెనీల నియామకాలు 57 శాతం పెరిగాయి. ఏఐ రిలేటెడ్ జాబ్స్‌‌‌‌  గత రెండేళ్లలో 42 శాతం ఎగిసి  2,53,000 పొజిషన్లకు చేరుకున్నాయి. 

పైతాన్‌‌‌‌, ఏఐ, మెషీన్ లెర్నింగ్‌‌‌‌, డేటా సైన్స్‌‌‌‌, డీప్ లెర్నింగ్‌‌‌‌, ఎస్‌‌‌‌క్యూఎల్‌‌‌, సాఫ్ట్‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ వంటి స్కిల్స్‌‌‌‌కు ఫుల్ డిమాండ్ కనిపించింది.  2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  కిందటి నెలలో  కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌, బెంగళూరు, చెన్నైలో ఉద్యోగ నియామకాలు ఎక్కువగా జరిగాయి. 

2024 నవంబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ముంబై, ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌లో ఎక్కువ నియామకాలు జరిగాయి.