కరోనా విస్తరిస్తుండటంతో.. వారం కిందట ఉన్న పరిస్థితులన్ని ఇప్పుడు మారిపోయాయి. నగరాన్నీ లాక్‌డౌన్ అయ్యాయి. అత్యవసర సేవలు అందించే వారు మినహా మిగతా ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల్లో మెజార్టీ సభ్యులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేశాయి. టీసీఎస్ గత పదిరోజుల క్రితం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం రోజుకు వెయ్యి ల్యాప్‌టాప్‌లను అందిస్తే.. ఇప్పుడు రోజుకు ఆరు వేల ల్యాప్‌టాప్‌లను షిప్ చేస్తున్నట్టు ప్రకటించింది.
మొత్తంగా ఈ కంపెనీలో నాలుగున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో 85 శాతం స్టాఫ్‌కు ఇప్పుడు టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తోంది. క్లయింట్ల వర్క్‌ను ఆపడం కుదరకపోవడంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేయకతప్పడం లేదు దేశంలోని ఐటీ కంపెనీలకు. ఇదేసమయంలో కొన్ని రకాల పనులను వారి చేత ఇంటి నుంచి చేయించడమూ సాధ్యం కాదని కంపెనీలు అంటున్నాయి. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని పేర్కొంటున్నాయి. మరోవైపు ఉద్యోగుల ఇళ్లలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్‌లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెబుతున్నాయి. ఇండియన్ ఐటీ కంపెనీలు బ్యాంక్‌లు, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, యుటిలిటీస్, స్టాక్ ఎక్స్చేంజ్‌లు వంటి ఎంతో కీలకమైన సేవలకు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి ఎటువంటి అంతరాయం కలుగకుండా సేవలను అందించాలి. ఇది ఇప్పుడు కత్తి మీద సాములాగా మారింది. బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి కీలక సంస్థలకు ఐటీ కంపెనీలు సర్వీసులను డెలివరీ చేయాలని, వీటిలో చాలా సెన్సిటివ్ డేటా ఉంటుందని అవుట్‌సోర్సింగ్ సొషన్స్ ప్రొవైడర్ డబ్ల్యూఎన్‌ఎస్ గ్రూప్ సీఈవో కేశవ్ మురుగేశ్ చెప్పారు. ఒకవేళ వీటిని ఉద్యోగుల ఇళ్లకు యాక్సస్ కల్పిస్తే.. సెక్యూరిటీ, ప్రైవసీ, రెగ్యులేటరీ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాక ఈ సేవలందించేందుకు నిరంతరాయంగా ఉండాల్సిన ఇంటర్నెట్ కూడా.. ఇళ్లలో సరిగా ఉండటం లేదని చెప్పారు. దేశంలోని చాలా కార్పొరేట్ కంపెనీలు, తమ తమ క్రిటికల్ అప్లికేషన్స్‌ను, నెట్‌వర్క్స్‌ను, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను చేపట్టే బాధ్యతను ఇండియన్ ఐటీ కంపెనీలకు ఇస్తున్నాయి. సెక్యూరిటీ విషయంలో రాజీ పడకుండా… క్లయింట్స్ సిస్టమ్స్, నెట్‌వర్క్స్‌కు కనెక్ట్ కావాల్సి ఉంటుంది. వైఫై నెట్‌వర్క్స్ ఇన్‌ఫర్మేషన్ డౌన్‌లోడ్‌కు బాగా పనిచేస్తాయి. కానీ ఈ సర్వీసు కంపెనీలు అప్‌లోడింగ్ కూడా చేపట్టాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. మెకానిజాన్ని మానిటర్ చేస్తున్నట్టు కంపెనీలు తెలిపాయి. ఒకవేళ ఉద్యోగుల ఇళ్లలో పీసీలు ఉన్నప్పటికీ, హై స్పీడ్ బ్యాండ్‌విడ్త్, వీపీఎన్ యాక్సస్, మల్టి ప్యాక్టర్ అథెంటికేషన్ కావాల్సి ఉంటుందని అమెరికాకు చెందిన అడ్వయిజరీ సంస్థ ఎవరెస్ట్ చెప్పింది.ఈ అన్ని రిసోర్సులు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. డేటా సెంటర్ సపోర్ట్‌ను, నెట్‌వర్క్ ఆపరేషన్, సెక్యూరిటీస్ ఆపరేషన్‌సెంటర్‌ను వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆఫర్ చేయలేకపోవచ్చని ఎవరెస్ట్ చెప్పింది.బిజినెస్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్‌ను, ప్రొక్యుర్‌మెంట్ ప్రాసెస్‌ను, అప్లికేషన్ డెవలప్‌మెంట్, ఎల్‌ప్రొడక్షన్‌సపోర్ట్ వంటి వాటినే కంపెనీలు అతి కష్టం మీద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తాయని తెలిపింది. వ్యాపారాలు కంటిన్యూగా కొనసాగేందుకు, పర్మిషన్ కోసం కస్టమర్లను ఆశ్రయిస్తున్నామని, రీజనబుల్‌గా ఉంటే వారు ఒకే చెబుతున్నట్టు ఒక ఐటీ సంస్థ సీఈఓ చెప్పారు.