గగనతల సాంకేతికతకు సంబంధించిన విదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజిన్ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చిందని, పరీక్షలకు కావేరీ ఇంజిన్ సిద్ధమైందని డీఆర్‌డీఓ ప్రకటించింది. డీఆర్‌డీఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్(జీటీఆర్ఈ) ఈ ఇంజిన్ను అభివృద్ధి చేసింది.
యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు 1980లో ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. వాటన్నింటిని అధిగమించి చివరకు స్వదేశీ విమాన ఇంజిన్ రూపుదాల్చింది. తదుపరి దశలో భాగంగా కావేరీ ఇంజిన్ను పలు విమానాల్లో పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షంచనున్నారు. వాటిలో కూడా విజయవంతమైతే విమాన ఇంజిన్ల కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.