దేశంలో పరుగులు పెడుతోన్న పారిశ్రామిక ఉత్పత్తి

దేశంలో పరుగులు పెడుతోన్న పారిశ్రామిక ఉత్పత్తి

న్యూఢిల్లీ: తయారీ రంగం మెరుగుదల కారణంగా సెప్టెంబరులో భారత పారిశ్రామిక ఉత్పత్తి 3.1 శాతం వృద్ధి చెందింది.  పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ) ఆధారంగా కొలిచే ఫ్యాక్టరీ ఉత్పత్తి సెప్టెంబర్ 2023లో 6.4 శాతం వృద్ధిని సాధించింది.  అయితే, ఇది ఆగస్టు 2024లో (-–) 0.1 శాతం వద్ద ప్రతికూల స్థాయిలో ఉంది.  నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్  విడుదల చేసిన డేటా ప్రకారం సెప్టెంబర్ 2024లో మైనింగ్, తయారీ  విద్యుత్ రంగాలలో వృద్ధి వరుసగా 0.2 శాతం, 3.9 శాతం  0.5 శాతంగా ఉంది.  ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో, ఐఐపీ గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 6.2 శాతం నుంచి 4 శాతం పెరిగింది.