ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

  • సోలార్‌‌‌‌ పవర్డ్‌‌‌‌ ‘ఇన్ఫినిటీ’డ్రోన్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేస్తున్న హాల్‌‌‌‌
  • 65 వేల అడుగుల ఎత్తుకెళ్లి మరీ శత్రు ప్రాంతాలపై నిఘా పెడ్తది
  • మన డ్రోన్లు ఎట్ల అటాక్‌‌‌‌ చేస్తున్నయో వీడియో తీసి గ్రౌండ్‌‌‌‌కు పంపిస్తది

న్యూఢిల్లీ: ఒక్కసారి పైకెగిరిందంటే దిగకుండా మూడ్నెళ్లు ఆకాశంలోనే తిరిగేస్తది. వాతావరణాన్ని దాటి 20 కిలోమీటర్ల ఎత్తు వరకు పోయి శత్రువులున్న ప్రాంతాలపై నిఘా పెడ్తది. అటాక్‌‌‌‌ చేయడానికి వెళ్లే డ్రోన్లను సమన్వయం చేస్తూనే అవి చేస్తున్న ఆపరేషన్‌‌‌‌ను డైరెక్ట్‌‌‌‌గా వీడియో తీసి గ్రౌండ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు పంపిస్తది. ఇట్లాంటి సూపర్​ ఫీచర్లతో అద్భుతమైన డ్రోన్‌‌‌‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) డెవలప్‌‌‌‌ చేస్తోంది. బెంగళూరులోని న్యూ స్పేస్ అనే స్టార్టప్‌‌‌‌తో కలిసి ఈ డ్రోన్‌‌‌‌ను ‘ఇన్ఫినిటీ’ పేరుతో తీసుకొస్తోంది. డ్రోన్‌‌‌‌కు అవసరమైన నిధులను హాల్ అంతర్గతంగానే సమకూర్చుకుంటోంది.

అటు చూస్తది.. ఇటు చూపిస్తది

మున్ముందు అవసరాల కోసం స్ట్రాటో ఆవరణం వరకు వెళ్లి పని చేసేలా ఈ డ్రోన్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేస్తున్నామని హాల్‌‌‌‌ అధికారులు చెప్పారు. కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (క్యాట్స్‌‌‌‌) ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా ఈ సోలార్‌‌‌‌ పవర్డ్‌‌‌‌ డ్రోన్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేస్తున్నామని.. మరో మూడు నుంచి ఐదేళ్లలో మిలటరీకి ఈ డ్రోన్‌‌‌‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అత్యాధునిక సింథటిక్ అపర్చర్ రాడార్‌‌‌‌ సహా రకరకాల సెన్సార్లున్నా ఈ డ్రోన్‌‌‌‌.. శత్రు భూభాగాలను లోతుగా, కచ్చితత్వంతో గమనిస్తుంటుందని వివరించారు. లాయల్‌‌‌‌ వింగ్‌‌‌‌మ్యాన్‌‌‌‌, ఆల్ఫా ఎస్‌‌‌‌ స్వార్మ్‌‌‌‌ లాంటి మన ఇతర డ్రోన్లను ఇది కో ఆర్డినేట్‌‌‌‌ కూడా చేయగలదని చెప్పారు. మన డ్రోన్లు చేస్తున్న దాడిని లైవ్‌‌‌‌ వీడియోగా గ్రౌండ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు పంపించగలదన్నారు. 2019లో పాకిస్తాన్‌‌‌‌లోని బాలాకోట్‌‌‌‌లో టెర్రరిస్టు ట్రైనింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లపై ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ దాడి చేసినప్పుడు ఇలాంటి లైవ్‌‌‌‌ వీడియో ప్రసారం లేక ఆ మిషన్‌‌‌‌ విజయంపై అనేక ప్రశ్నలు తలెత్తాయని, ఇన్ఫినిటీతో ఈ సమస్య తీరనుందని వివరించారు.

డిజాస్టర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కూ వాడుకోవచ్చు

మిలటరీ ఆపరేషన్లకే కాకుండా విపత్తు నిర్వహణ, స్మార్ట్ సిటీ మిషన్‌‌‌‌, సహజ వనరుల నిర్వహణకు, మన కోస్టల్‌‌‌‌ వాటర్‌‌‌‌ వేస్‌‌‌‌పై నిఘా పెట్టడానికి ఇన్ఫినిటీ డ్రోన్ వాడుకోవచ్చని అధికారులు చెప్పారు. 4జీ, 5జీ సేవలను కూడా ఇన్‌‌‌‌ఫినిటీతో విస్తరించవచ్చన్నారు. ఇందులోని ఇన్ఫ్రారెడ్, ఇమేజింగ్ పేలోడ్‌‌‌‌ పరికరాలు ఇలాంటి అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సాధారణంగా శాటిలైట్ల తయారీ, లాంచ్‌‌‌‌, ఆపరేషన్‌‌‌‌కు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇన్‌‌‌‌ఫినిటీ ఆపరేషనల్‌‌‌‌ ఖర్చు తక్కువేనని వివరించారు. ఎయిర్ బస్ డెవలప్‌‌‌‌ చేసిన సోలార్ ఎలక్ట్రిక్ స్ట్రాటోస్పియరిక్‌‌‌‌ డ్రోన్ ‘జెఫైర్’ క్లాస్‌‌‌‌ రకానిదే ఇన్ఫినిటీ అని చెబుతున్నారు.