మరో ఆరు కొత్త ఐపీఓలు..రూ. 2,500 కోట్ల సేకరణ

మరో ఆరు కొత్త ఐపీఓలు..రూ. 2,500 కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్ ఫుల్ జోష్‌‌‌‌లో ఉంది. మరో ఆరు ఐపీఓలు ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు రాబోతున్నాయి. ఇందులో రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు కాగా, నాలుగు ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓలు. ఈ కంపెనీలు సుమారు రూ. 2,500 కోట్లు సేకరించనున్నాయి. నవంబర్‌‌‌‌‌‌‌‌లో  ప్రైమరీ మార్కెట్‌‌‌‌ సందడి చేసిందని, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని  మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్‌‌‌‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌ అర్విందర్‌‌‌‌‌‌‌‌ సింగ్ నందా అన్నారు. రానున్న రెండు నెలల్లో 15 ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయని చెప్పారు. అయినప్పటికీ ఐపీఓల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేసే ముందు కంపెనీల వాల్యూయేషన్స్‌‌‌‌ గమనించాలని, సేకరించిన డబ్బులను దేని కోసం ఖర్చు చేస్తాయో తెలుసుకోవాలని  సలహా ఇచ్చారు. ఈ ఏడాది  ఐపీఓకి వచ్చిన కంపెనీలు సుమారు రూ.41 వేల కోట్లు సేకరించాయి.  ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన కంపెనీలు సంఖ్యను చూస్తే  గ్లోబల్‌‌‌‌గా టాప్‌‌‌‌లో ఉన్నాం. కిందటి ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 21 ఐపీఓలు వచ్చాయి. 1,770 మిలియన్ డాలర్లు సేకరించాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ కేవలం నాలుగు మాత్రమే. ఇది  376 శాతం గ్రోత్‌‌‌‌కు సమానం. 

ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓలు..

1. ఎస్‌‌‌‌జే లాజిస్టిక్స్  

కంపెనీ ఐపీఓ ఈ నెల 12 న ఓపెనై, 14 న ముగుస్తుంది.  షేరు ధర రూ.121–125. లాట్‌‌‌‌ సైజ్‌‌‌‌ 1,000 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్ల కనీస ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ రూ.1,25,000.  మొత్తం 38.4 లక్షల షేర్లను అమ్మడం ద్వారా రూ.48 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. 

2.   ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్‌‌‌‌

పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.23.30 కోట్లు సేకరించాలని ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్ చూస్తోంది. ఇందుకోసం 32.37 లక్షల షేర్లను అమ్మనుంది. కంపెనీ షేరు రూ.72 దగ్గర ఐపీఓలో అందుబాటులో ఉంటుంది. ఈ ఐపీఓ డిసెంబర్ 11 న ఓపెనై, 13 న ముగియనుంది. లాట్‌‌‌‌ సైజ్‌‌‌‌ 1,600 షేర్లు. రిటైల్‌‌‌‌ ఇన్వెస్టర్ల కనీసంగా రూ.1,15,200 ఇన్వెస్ట్ చేయాలి. 

3.   శ్రీ ఓఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎం ఈ–మొబిలిటీ

ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 14 న ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 18 న ముగుస్తుంది. ఐపీఓలో ఒక్కో షేరు రూ.65 దగ్గర అందుబాటులో ఉంటుంది. లాట్ సైజ్‌‌‌‌ 2,000 షేర్లు. కనీస ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రూ.1,30,000. మొత్తం 37.84 లక్షల షేర్లను అమ్మడం ద్వారా రూ.24.60 కోట్లు సేకరించనున్నారు.

4.   సియారామ్​ రీసైక్లింగ్‌‌‌‌

సియారామ్​ రీసైక్లింగ్ ఐపీఓ కూడా ఈ నెల 14 న ఓపెనై, 18 న ముగియనుంది. 49.92 లక్షల షేర్లను అమ్మడం ద్వారా రూ.22.96 కోట్లు సేకరించనుంది.  ఒక్కో షేరు ధర రూ.43–46. లాట్ సైజ్‌‌‌‌ 3,000 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిన కనీస పెట్టుబడి రూ.1,38,000.

5.   మరోవైపు యాక్సెంట్‌‌‌‌ మైక్రోసెల్ లిమిటెడ్ ఐపీఓ సోమవారం ముగియనుంది. కంపెనీ షేర్లు ఒక్కొక్కటి రూ.133–140 దగ్గర అందుబాటులో ఉన్నాయి.

కొత్త లిస్టింగ్‌‌‌‌లు..

గ్రాఫైసడ్స్‌‌‌‌, ఈ నెల 13 న,  శీతల్ యూనివర్సల్‌‌‌‌  షేర్లు డిసెంబర్ 11 న , యాక్సెంట్‌‌‌‌ మైక్రోసెల్‌‌‌‌ ఈ నెల 15 న ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ఎస్‌‌‌‌ఎంఈ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ కానున్నాయి. 

ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకొచ్చే ఐపీఓలు..

1. ఇండియా షెల్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌‌‌‌..

ఈ కంపెనీ ఐపీఓ డిసెంబర్ 13 న ఓపెన్ కానుంది.  డిసెంబర్ 15 న ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,200 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఇండియా షెల్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ 1.62 కోట్ల ఫ్రెష్ షేర్లను అమ్మి రూ.800 కోట్లు సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్ హోల్డర్లు మరో 81 లక్షల షేర్లను అమ్మనున్నారు. వీరు రూ.400 కోట్లు రైజ్ చేయనున్నారు. ఒక్కో షేరుని రూ.469–493 రేంజ్‌‌‌‌లో ఇండియా షెల్టర్ ఫైనాన్స్ అమ్మకానికి పెట్టింది. ఒక్కో లాట్‌‌‌‌లో 30 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనిష్టంగా రూ.14,790 ఇన్వెస్ట్ చేయాలి. 

2. డొమ్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌..

స్టేషనరీ ప్రొడక్ట్‌‌‌‌లు తయారు చేసే  డొమ్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌ ఐపీఓ ద్వారా  రూ. 1,200 కోట్లు సేకరించాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకుంది. కంపెనీ ఐపీఓ ఈ నెల 13 న ఓపెనై, 15 న ముగుస్తుంది. ఒక్కో షేరు రూ.750–790 దగ్గర అందుబాటులో ఉంది. లాట్ సైజ్ 18 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్ల కనీస ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రూ.14,220. ఈ పబ్లిక్ ఇష్యూలో 44 లక్షల ఫ్రెష్‌‌‌‌ షేర్లను అమ్మాలని కంపెనీ చూస్తోంది.  రూ.350 కోట్లు సేకరించనుంది. షేర్ హోల్డర్లు మరో 1.08 కోట్ల షేర్లను సేల్ చేసి రూ.850 కోట్లను సేకరించనున్నారు.