న్యూఢిల్లీ: హోటల్స్ బిజినెస్‌ను ఐటీసీ గ్రూప్ నుంచి వేరు చేసి సపరేట్ కంపెనీగా మార్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. క్యాపిటల్‌ను మెరుగ్గా వాడుకోవడానికి ఈ నిర్ణయం సాయపడుతుందని ఐటీసీ వెల్లడించింది. ‘ఇదో గొప్ప డీమెర్జర్. ఐటీసీ ఖర్చు చేస్తున్న క్యాపిటల్‌పై మెరుగైన రిటర్న్‌ను పొందడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. క్యాపిటల్ ఎఫిషియెన్సీ రేషియో 20 శాతం పెరుగుతుంది’ అని ఐఐఎఫ్‌ఎల్ ఎనలిస్ట్ నెమ్‌కుమార్ అన్నారు.
డీమెర్జర్ రూల్స్ ప్రకారం, ఐటీసీ హోటల్స్ బిజినెస్‌లో 40 శాతం వాటా ఐటీసీ గ్రూప్ కంట్రోల్‌లో ఉంటుంది. మిగిలిన వాటాను కంపెనీ షేర్ హోల్డర్లకు వారికున్న వాటా తగ్గట్టు పంచుతారు. డీమెర్జర్ ప్రాసెస్ పూర్తవ్వడానికి తొమ్మిది నుంచి 12 నెలల టైమ్ పడుతుందని, ప్రతీ 100 ఐటీసీ షేర్లు ఉన్న షేర్ హోల్డర్‌కు ఐటీసీ హోటల్స్ బిజినెస్‌కు చెందిన 60 షేర్లను ఇష్యూ చేస్తారు. కొత్త కంపెనీలో ఐటీసీకి 40 శాతం వాటా ఉండడం వలన హోటల్ బిజినెస్‌కు స్టెబిలిటీ ఉంటుందని మరో ఎనలిస్ట్ వెల్లడించారు.
ఇన్వెస్టర్లకు నచ్చలేదు..
హోటల్ బిజినెస్ డీమెర్జర్‌ను అంచనావేసినప్పటికీ, పూర్తి స్థాయిలో డీమెర్జర్ కాకపోవడంతో ఐటీసీ షేర్లు సోమవారం సెషన్‌లో 4 శాతం మేర నష్టపోయాయి. మొత్తం వాటాను షేర్ హోల్డర్లకు పంచుతారని అంచనావేయగా, 40 శాతం వాటాను ఐటీసీ గ్రూప్ హోల్డ్ చేయనుండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కంపెనీ షేర్లు సోమవారం సెషన్‌లో 4.30 శాతం నష్టపోయి రూ.469 దగ్గర క్లోజయ్యాయి.