విమెన్స్ ఐపీఎల్లో ఆడేందుకు రెడీ

విమెన్స్ ఐపీఎల్లో ఆడేందుకు రెడీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ :  దాదాపు 22 ఏండ్ల ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ మధ్యే వీడ్కోలు పలికిన ఇండియా లెజెండరీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ  గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశం కనిపి స్తోంది. వచ్చే ఏడాది జరిగే విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని మిథాలీ చెప్పింది.

‘విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలయ్యేందుకు  మరికొన్ని నెలల సమయం ఉంది.  తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగం అయితే సంతోషమే. కానీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆడే ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ఉంది’ అని మిథాలీ చెప్పుకొచ్చింది. ఇక, యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మపై రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రశంసల వర్షం కురిపించింది. అలాంటి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరానికి ఒక్కరే వస్తారని అభిప్రాయపడింది.