ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ సంక్షోభం అంచున..పెరుగుతున్న మైక్రో లోన్ మొండి బకాయిలు

ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ సంక్షోభం అంచున..పెరుగుతున్న మైక్రో లోన్ మొండి బకాయిలు
  • మైక్రో లోన్ సెగ్మెంట్‌‌‌‌లో  పెరుగుతున్న మొండిబాకీలు
  • పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నరు
  • కరోనా తర్వాత  2,100 శాతం పెరిగిన చిన్న రుణాలు 
  • ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్ సులభం చేయడంతో పెద్ద మొత్తంలో అప్పులిచ్చిన సంస్థలు
  • గ్రామీణ ప్రాంతాల్లోనే సమస్య ఎక్కువ

న్యూఢిల్లీ: ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ సంక్షోభం అంచున ఉంది. మైక్రో ఫైనాన్స్‌‌ కంపెనీలు ఇచ్చిన చాలా సబ్‌‌‌‌ప్రైమ్ లోన్లు (క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌ తక్కువ ఉన్న వారికి ఎక్కువ వడ్డీ రేటు వద్ద ఇచ్చే లోన్లు) మొండిబాకీలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి లోన్లు తీసుకున్న వారిలో 68 శాతం మంది తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.  

చాలా ఫైనాన్షియల్ సంస్థలు తమ బిజినెస్‌‌‌‌ను విస్తరించడానికి గత కొంత కాలంగా సబ్‌‌‌‌ప్రైమ్‌‌‌‌ లోన్లను భారీగా ఇచ్చాయి. ముఖ్యంగా మైక్రో లోన్లపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. మైక్రో ఫైనాన్స్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌  సైజ్‌‌‌‌ ప్రస్తుతం 45 బిలియన్‌‌‌‌ డాలర్ల (సుమారు రూ.3.87 లక్షల కోట్ల) కు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ)ఈ సంస్థలపై నిఘా పెంచాలని నిపుణులు కోరుతున్నారు.  

ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన రుణాల్లో  91 రోజులు నుంచి  180 రోజుల పాటు బకాయిలుగా ఉన్న లోన్ల వాటా  తాజాగా  3.3 శాతానికి చేరుకుంది.  2023 జూన్‌‌‌‌లో ఈ నెంబర్ 0.8 శాతంగా నమోదైంది.  ఇంకా పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నవారి వాటా  27 శాతానికి పెరిగింది. దీనిని బట్టి  ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఒత్తిడి పెరుగుతోందనే విషయం అర్థమవుతోంది.  లక్షలాది మంది స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, చిన్న ఉద్యోగులు తీసుకున్న తక్కువ సైజ్ లోన్ల విలువ భారీగా పెరిగింది. 

మానిటర్ చేసేందుకు ఒక వ్యవస్థ 

పట్టణ ప్రాంతాల్లోని పేదల ఖర్చులు, ఆదాయాల గురించి  ఫైనాన్షియల్ కంపెనీలకు ఓ ఐడియా ఉంటోంది. ఆన్‌‌‌‌లైన్ పేమెంట్స్ పెరుగుతుండడంతో  కంపెనీలు వీరి రుణ సామర్ధ్యం గురించి తెలుసుకోగలుగుతున్నాయి.  కానీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాష్‌‌‌‌  వాడకం ఎక్కువగా ఉంది. ఫైనాన్షియల్ సంస్థలు వీరి  ఖర్చులను అంచనా వేయడంలో ఇబ్బంది పడుతున్నాయి.  

క్రెడిట్ బ్యూరోలు ఉన్నా, వీటి వద్ద  ఫిన్‌‌‌‌టెక్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు లేదా బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాల గురించి డేటా ఉండకపోవచ్చు.  మైక్రో ఫైనాన్స్‌‌‌‌కు  సంబంధించి 2022లో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కొన్ని రూల్స్ మార్చింది. ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న కుటుంబాలు లోన్‌‌‌‌ తీసుకుంటే వీటికి కొలేటరల్ అవసరం లేదు. ఇటువంటి లోన్లను మైక్రో ఫైనాన్స్ లోన్లుగా పిలుస్తారు. 

రూల్స్‌‌‌‌ను సులభతరం చేయడంతో మైక్రోఫైనాన్స్ లోన్లు ఇవ్వడం భారీగా పెరిగింది.  చాలా సంస్థలు, బ్యాంకులు కూడా ఈ సెగ్మెంట్‌‌‌‌లో భారీగా ఇన్వెస్ట్ చేశాయి.  కరోనా సంక్షోభం తర్వాత రూల్స్ సులభతరం కావడంతో మైక్రోఫైనాన్స్‌‌‌‌ లోన్లకు భారీగా డిమాండ్ కనిపించింది. రోజువారీ అవసరాలు, వ్యాపారాలు, వివాహాలు, వస్తువుల కొనుగోలు కోసం లోన్లు తీసుకోవడం పెరిగింది.