Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జ‌ట్లు అర్హత

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జ‌ట్లు అర్హత

భార‌త్‌కు చెందిన 4×400 మీట‌ర్ల మ‌హిళ‌ల‌, పురుషుల జ‌ట్లు ఈ ఏడాది పారిస్‌ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు అర్హ‌త సాధించాయి. సోమవారం(మే 06) బహామాస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలేస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు రెండో రౌండ్ హీట్స్‌లో రెండవ స్థానంలో నిలిచాయి. 

మహిళల విభాగంలో రూపల్ చౌదరి, ఎంఆర్ పూవమ్మ, జ్యోతిక శ్రీ దండి, శుభా వెంకటేశన్‌ల క్వార్టెట్ 3 నిమిషాల 29.35 సెకన్లలో గమ్యం చేరి ప్యారిస్ బెర్త్ బుక్ చేసుకున్నారు. ఈ రేసులో జ‌మైకా(3:28.54 సెకన్లు) బృందం తొలి స్థానంలో నిలిచింది. ఇక పురుషుల విభాగంలో మ‌హ‌మ్మ‌ద్ అనాస్ య‌హియా, మొహ‌మ్మ‌ద్ అజ్మ‌ల్‌, అరోకియా రాజీవ్‌, అమోజ్ జాక‌బ్ బృందం 3 నిమిషాల 3.23 సెక‌న్ల‌లో ముగించి రెండో స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో అమెరికా(2:59.95 సెకన్లు) మొదటి స్థానంలో నిలిచింది. 

జూలై 26 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు పారిస్ ఒలింపిక్స్ క్రీడ‌లు జ‌ర‌గ‌నుండగా.. అథ్లెటిక్స్ ఈవెంట్‌లు ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్నాయి.  మొత్తం 32 క్రీడాంశాలు ఉంటాయి. ఇందుకోసం 35 వేదికలను రెడీ చేశారు.

ఒలింపిక్స్‌ 2024కి అర్హత సాధించిన భారత అథ్లెట్ల జాబితా

  • యాంటీమ్ పంఘల్: రెజ్లింగ్ (మహిళల 53 కేజీలు)
  • వినేష్ ఫోగట్: రెజ్లింగ్ (మహిళల 50 కేజీలు)
  • అన్షు మాలిక్: రెజ్లింగ్ (మహిళల 57 కేజీలు)
  • రీతికా హుడా: రెజ్లింగ్ (మహిళల 53 కేజీలు)
  • లోవ్లినా బోగోహైన్: బాక్సింగ్ (మహిళల 75 కేజీలు)
  • నిఖత్ జరీన్: బాక్సింగ్ (మహిళల 50 కేజీలు)
  • పర్వీన్ హుడా: బాక్సింగ్ (మహిళల 57 కేజీలు)
  • ప్రీతి పవార్: బాక్సింగ్ (మహిళల 54 కేజీలు)
  • మీరాబాయి చాను: వెయిట్ లిఫ్టింగ్ (మహిళల 49 కేజీలు)
  • అనూష్ అగర్వాలా: గుర్రపుస్వారీ (వ్యక్తిగత వస్త్రధారణ)
  • బలరాజ్ పన్వార్: రోయింగ్ (పురుషుల సింగిల్స్ స్కల్స్) 
  • విష్ణు శరవణన్: సెయిలింగ్ (పురుషుల ICLA7)
  • నేత్ర కుమనన్: సెయిలింగ్ (మహిళల ILCA6)
  • పివి సింధు: బ్యాడ్మింటన్ (మహిళల సింగిల్స్)
  • HS ప్రణయ్: బ్యాడ్మింటన్ (పురుషుల సింగిల్స్)
  • లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ (పురుషుల సింగిల్స్)
  • సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి: బ్యాడ్మింటన్ (పురుషుల డబుల్స్)
  • అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో: బ్యాడ్మింటన్ (మహిళల డబుల్స్)
  • ధీరజ్ బొమ్మదేవర: ఆర్చరీ (పురుషుల రికర్వ్)
  • నీరజ్ చోప్రా: అథ్లెటిక్స్ (పురుషుల జావెలిన్ త్రో)
  • కిషోర్ కుమార్ జెనా: అథ్లెటిక్స్ (పురుషుల జావెలిన్ త్రో)
  • అవినాష్ సాబల్: అథ్లెటిక్స్ (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్)
  • పారుల్ చౌదరి: అథ్లెటిక్స్ (మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్)
  • ప్రియాంక గోస్వామి: అథ్లెటిక్స్ (మహిళల 20 కి.మీ రేస్‌వాక్)
  • అక్షదీప్ సింగ్: అథ్లెటిక్స్ (పురుషుల 20 కి.మీ రేస్‌వాక్)
  • రామ్ బాబూ: అథ్లెటిక్స్ (పురుషుల 20 కి.మీ రేస్‌వాక్)
  • అర్ష్‌ప్రీత్ సింగ్: అథ్లెటిక్స్ (పురుషుల 20 కి.మీ రేస్‌వాక్)
  • వికాస్ సింగ్: అథ్లెటిక్స్ (పురుషుల 20 కి.మీ రేస్‌వాక్)
  • పరమజీత్ బిష్త్: అథ్లెటిక్స్ (పురుషుల 20 కి.మీ రేస్‌వాక్)
  • సూరజ్ పవార్: అథ్లెటిక్స్ (పురుషుల 20 కి.మీ రేస్‌వాక్)
  • సర్విన్ సెబాస్టియన్: అథ్లెటిక్స్ (పురుషుల 20 కి.మీ రేస్‌వాక్)
  • అక్షదీప్ సింగ్, ప్రియాంక గోస్వామి: అథ్లెటిక్స్ (మిక్స్‌డ్ మారథాన్ రేస్‌వాక్ రిలే)
  • పాలక్ గులియా: షూటింగ్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్)
  • ఈషా సింగ్: షూటింగ్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్)
  • మను భాకర్: షూటింగ్ (మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్)
  • రిథమ్ సాంగ్వాన్: షూటింగ్ (మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్)
  • మెహులీ ఘోష్: షూటింగ్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్)
  • తిలోత్తమ సేన్: షూటింగ్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్)
  • షిఫ్ట్ కౌర్ సమ్రా: షూటింగ్ (మహిళల 50మీ రైఫిల్ 3P)
  • శ్రీయాంక సడంగి: షూటింగ్ (మహిళల 50మీ రైఫిల్ 3P)
  • రాజేశ్వరి కుమారి: షూటింగ్
  • రైజా ధిల్లాన్: షూటింగ్
  • సరబ్జోత్ సింగ్: షూటింగ్ (పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్)
  • వరుణ్ తోమర్: షూటింగ్ (పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్)
  • అనీష్ భన్వాలా: షూటింగ్ (పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్)
  • విజయవీర్ సిద్ధూ: షూటింగ్ (పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్)
  • రుద్రాంక్ష్ పాటిల్: షూటింగ్ - పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
  • అర్జున్ బాబుటా: షూటింగ్  (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్)
  • స్వప్నిల్ కుసలే: షూటింగ్ (పురుషుల 50 మీ రైఫిల్ 3P)
  • అఖిల్ షెరాన్: షూటింగ్ (పురుషుల 50 మీ రైఫిల్ 3P)
  • భౌనీష్ మెండిరట్ట: షూటింగ్ (పురుషుల ట్రాప్)
  • అనంతజీత్ సింగ్ నరుకా: షూటింగ్ (పురుషుల స్కీట్)
  • మహేశ్వరి చౌహాన్: షూటింగ్ (మహిళల స్కీట్)
  • భారత పురుషుల హాకీ జట్టు
  • భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు
  • భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు
  • భారత పురుషుల రిలే జట్టు: రిలే 4*400మీ
  • భారత మహిళల రిలే జట్టు: రిలే 4*400మీ
  • మురళీ శ్రీశంకర్: లాంగ్ జంప్ అథ్లెట్ (గాయం కారణంగా వైదొలిగాడు)