చంద్రయాన్–2 కలకు గాయం

చంద్రయాన్–2 కలకు గాయం
  • ఇస్రో పరీక్షలో దెబ్బతిన్న మూన్ ల్యాండర్
  • ప్రయోగం మరింత వాయిదా పడే చాన్స్

జాబిలిపై మళ్లీ అడుగుపెట్టి భారతశక్తిని మరోమారు ప్రపంచానికి చాటి చెప్తాడనుకున్న ‘విక్రమ్’కు గాయాలయ్యాయి. ఇంతకీ ఆ విక్రమ్‌‌ ఎవరంటారా? చంద్రయాన్‌‌2లో భాగంగా చంద్రుడిపై దిగే ల్యాండర్‌‌. పరీక్షలో దాని రెండు కాళ్లు దెబ్బ తిన్నాయని ఇస్రో చైర్మన్ కె .శివన్ వెల్లడించారు. దానికి మార్పులు చేయాలని  చెప్పా రు. దీంతో చంద్రయాన్–2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెలలో ఇస్రో చంద్రయాన్–2 ప్రయోగం చేయాల్సి ఉంది. ‘చంద్రయాన్–2’లో ల్యాండర్‌‌తో పాటు రోవర్ కూడా ఉంది. ల్యాండర్ చంద్రుడిపై దిగితే, రోవర్ మాత్రం జాబిల్లి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. ల్యాండర్ విక్రమ్ లోపల సీస్మో మీటర్, థర్మల్ప్రోబ్, రోవర్ లో పల స్పెక్ట్రో మీటర్లు (చంద్రుడి నేలను శోధిస్తాయి) ఉంటాయి. మేలో జరగనున్న ప్రయోగం కోసం ఫిబ్రవరిలో రోవర్,ల్యాండర్‌‌ను టెస్టు చేశారు. కానీ ల్యాండింగ్టైంలో విక్రమ్ రెండు కాళ్లు దెబ్బతిన్నాయి.ల్యాండర్ బరువును మోసేలా కాళ్లు దృఢంగా లేకపోవడమే ఇందుకు కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. మార్పులపై  సీనియర్ సైంటిస్టు యూఆర్ రావు నేతృత్వంలో 12 మంది సభ్యుల టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను ఇస్రో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మే నెలలోనే ప్రయోగం ఉంటుందని శివన్ వెల్లడించారు. ‘చంద్రయాన్’ చంద్రుడిని చేరడానికి 14 రోజులు పడుతుంది. రోవర్, ల్యాండర్ కు సూర్యరశ్మి బాగా అందాలంటే చంద్రుడు, భూమి, సూర్యు డు ఒకే రేఖపైకి వచ్చినప్పుడు ప్రయోగం చేయాలి. మే నెలలో కుదరకపోతే ఏడాది రెండో అర్ధ భాగానికి వాయిదా పడే అవకాశాలున్నాయి.

ఆస్టరాయిడ్ ను పేల్చిన జపాన్ 

జపాన్ స్పేస్ ఏజెన్సీ మరో ఘనత సాధించింది. శాటిలైట్‌‌తో ఆస్టరాయిడ్ ను పేల్చి ఆశ్చర్యపర్చింది. ర్యుగు ఆస్టరాయిడ్‌ కు అర కిలోమీటరు దగ్గరగా వెళ్లిన హయబూసా–2 బాంబును గురి చూసి వదిలింది. టైమర్ పెట్టడంతో శాటిలైట్ అక్కడి నుంచి వెళ్లిన 40 నిమిషాలకు అది పేలింది. దీంతో ర్యుగుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. విశ్వం పుట్టుకపై అధ్యయనం కోసం జపాన్ ఈ పని చేసింది. హయాబూసా బాంబు పేలుడును రికార్డు చేసింది కూడా.