ఇండియా పేరు మారిస్తే.. కమల్ సినిమా పరిస్థితేంటి?

ప్రస్తుతం మన దేశంలో ఇండియా(India) పేరు మార్పు అనేది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇండియా పేరును భారత్‌(Bharath)గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. 

ఇదిలా ఉంటే ఇండియా పేరు మార్పు అనేది ఒక బడా హీరో సినిమాను అనుకోని విధంగా చిక్కుల్లో పడేసేలా ఉంది. ఆ బడా హీరో మరెవరో కాదు. లోకనాయకుడు కమల్ హాసన్. ఆయన ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్‌-2. 27ఏళ్ల క్రితం శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. ఇండియా పేరు మార్పు అనేది ఈ సినిమాకు ఇప్పుడు సమస్యగా మారింది. 27 ఏళ్ళ క్రితం తెలుగులో ఈ సినిమాను భారతీయుడుగా రిలీజ్ చేశాడు మేకర్స్. అప్పడు ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు నిజంగా ఇండియా పేరు మారితే.. తెలుగులో ఈ సినిమాను భారతీయుడు-2’గా రిలీజ్ చేయాల్సి ఉటుంది. మరి ఇతర భాషల్లో ఈ సినిమాకు ఏ పేరు పెడతారు? అనేది ఇప్పుడు సినీవర్గాల్లో పెద్ద చర్చనియ్యాంశంగా మారింది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఇక ఇండియా2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కమల్ హాసన్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.