భారీగా పెరగనున్న సీఎన్జీ​ వాడకం.. 2030 నాటికి 60 శాతం జంప్​

భారీగా పెరగనున్న సీఎన్జీ​ వాడకం.. 2030 నాటికి 60 శాతం జంప్​

న్యూఢిల్లీ:  ఆటోమొబైల్స్‌‌‌‌‌‌‌‌,  వంట,  పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించే కంప్రెస్డ్​ నేచురల్​గ్యాస్​(సీఎన్జీ) వాడకం 2030 నాటికి దాదాపు 60 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆయిల్ రెగ్యులేటర్ పీఎన్​జీఆర్​బీ తెలిపింది. కరెంటు, ఎరువుల తయారీకి కూడా వాడే ఈ గ్యాస్ ​వాడకం 2023–-24లో రోజుకు 188 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు ఉండగా, 2030 నాటికి 297 ఎంఎంఎస్​సీఎండీలకు పెరుగుతుందని పెట్రోలియం, నేచురల్​గ్యాస్​రెగ్యులేటరీ బోర్డు (పీఎన్​జీఆర్​బీ) స్టడీ తెలిపింది. 

దీని వినియోగం 2040 నాటికి ఇది 496 ఎంఎంఎస్​సీఎండీలకు చేరుతుందని అంచనా.  పీఎన్​జీఆర్​బీ ఇటీవలి సంవత్సరాలలో 307  ప్రాంతాలకు సిటీ గ్యాస్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌లను మంజూరు చేసింది. వీటితో దేశమంతటికీ గ్యాస్​ సరఫరా అవుతోందని తెలిపింది.