న్యూఢిల్లీ: ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు మిడిల్ ఈస్ట్‌పై ఫోకస్ పెట్టాయి. ట్రంప్ ప్రభుత్వం రష్యా, ఇరాన్‌పై ఆంక్షలు పెంచుతుందనే అంచనాలు పెరిగాయి. దీంతో ఇండియన్ కంపెనీలు మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి.
ఈ విషయంలో చైనా కూడా ఇండియాను ఫాలో అవుతోంది. ఈ వారం ఇండియన్ కంపెనీలు ఒమన్, అబుదాబి నుంచి 60 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ను కొనుగోలు చేశాయని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.
రష్యా నుంచి వచ్చే కార్గో షిప్‌లు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. రష్యా ఉరల్స్, ఈఎస్‌పీఓ, ఇరానియన్ లైట్ క్రూడ్ ఆయిల్‌ను మోసుకెళ్లే ట్యాంకర్లపై యుఎస్ మరిన్ని ఆంక్షలు పెడుతుందనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. అదే జరిగితే ఆయిల్ సప్లయ్ చెయిన్ దెబ్బతింటుంది.