ఆఖరి పోరుకు టీమిండియా రెడీ.. నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్

ఆఖరి పోరుకు టీమిండియా రెడీ..   నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్

బెంగళూరు :  ఓవైపు దేశంలో దీపావళి సందడి.. మరోవైపు వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ 50వ సెంచరీపై దృష్టి.. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఇండియా ఆఖరి పోరుకు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా.. నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించిన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేనకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితంతో పెద్దగా పని లేకపోయినా.. బెంగళూరును తన సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూసుకునే కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ ఇదే వేదికలో వరల్డ్ రికార్డు సెంచరీ కొడితే చూడాలని యావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి చూస్తే సెంచరీ చేయడం పెద్ద లెక్కనే కాదు. 2011లో 282 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2015లో 305 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2019లో 443 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన కోహ్లీ.. ఈ టోర్నీలో ఇప్పటికే 543 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. కాబట్టి ఎలా చూసుకున్నా తన స్పిర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 50ని పూర్తి చేస్తాడని ఆశిస్తున్నారు. సౌతాఫ్రికా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత వారం రోజుల గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో ప్లేయర్లందరూ మంచి హుషారుగా ఉన్నారు. దీంతో గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఆడిన ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే బరిలోకి దిగనున్నారు. అయితే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి భారీ స్కోరు బాకీ ఉంది. 

4 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 85 రన్సే చేసిన అతని నుంచి ఓ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్నారు. డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అతను దీన్ని సాకారం చేస్తాడా? చూడాలి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదిరిపోతున్నది. బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షమీ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురొడ్డి నిలిచే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికైతే కనిపించలేదు. నాకౌట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణకు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కొచ్చు. స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టార్లే బెంబేలెత్తుతున్నారు. మొత్తానికి న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీమిండియా డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిహార్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్నది. 

డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీ ఇస్తుందా?

మరోవైపు నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంచలనంపై దృష్టి పెట్టింది. భారీ విజయంతో టోర్నీని ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌతాఫ్రికా తరహాలో ఇండియాకు కూడా షాకివ్వాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తోంది. అయితే టీమిండియా ఉన్న ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి చూస్తే డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల నెరవేరే అవకాశం లేదు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డి లీడె, మీకెరెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెలరేగితే కొంత వరకు పోటీ ఇవ్వొచ్చు. అయితే బెంగళూరు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లను ఆపాలంటే వాళ్లు శక్తికి మించి శ్రమించాలి. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు, స్కాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అకెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ డౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెస్లీ బారెసీ భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియాను నిలువరించాలంటే డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదృష్టం కూడా కలిసి రావాలే. 

జట్ల అంచనా

ఇండియా : రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడేజా, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బుమ్రా / ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ, షమీ. 

నెదర్లాండ్స్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: స్కాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ డౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బారెసీ, అకెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైబ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి లీడె, తేజ, వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అర్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మీకెరెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.