IND vs ENG: ఇంగ్లాండ్‌తో చివరి వన్డే.. సుందర్, అర్షదీప్‌కు ఛాన్స్.. ఆ ఇద్దరికి రెస్ట్

IND vs ENG: ఇంగ్లాండ్‌తో చివరి వన్డే.. సుందర్, అర్షదీప్‌కు ఛాన్స్.. ఆ ఇద్దరికి రెస్ట్

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో భారత్ నేడు (ఫిబ్రవరి 12) చివరి వన్డే ఆడుతుంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న రోహిత్ సేన చివరి మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ పై దృష్టి పెట్టనుంది. మరో వైపు ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి వన్డే కావడంతో ఈ మ్యాచ్ లో భారత్ రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించాలని చూస్తుంది. 

తుది జట్టులో సుందర్, అర్షదీప్

ఈ మ్యాచ్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్, ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనప్పటికీ తొలి రెండు వన్డేల్లో చోటు దక్కలేదు. దీంతో చివరి వన్డేలో వీరిద్దరికీ చోటు కల్పించనుంది. అదే జరిగితే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ,ఆల్ రౌండర్ జడేజా లకు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వనున్నారు. యశస్వి జైస్వాల్ బెంచ్‌‌‌‌‌‌‌‌కే పరిమితం కానున్నాడు. ఈ రెండు మార్పులు మినహాయిస్తే భారత్ రెండో వన్డే ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది.

Also Read : నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో నందినికి స్వర్ణం

టీ20, వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లను కోల్పోయిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ కనీసం ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. భారీ ఆశలు పెట్టుకున్న కోర్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్‌‌‌‌‌‌‌‌ కావడం ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఆందోళనలో పడేసింది. ఇది ఇలాగే కొనసాగితే చాంపియన్స్‌‌‌‌‌‌‌‌లో తిప్పలు తప్పవని భావిస్తోంది. ఓపెనర్లు డకెట్‌‌‌‌‌‌‌‌, సాల్ట్‌‌‌‌‌‌‌‌తో పాటు బట్లర్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నా మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ వైఫల్యం టీమ్‌‌‌‌‌‌‌‌ను వెంటాడుతోంది. బ్రూక్‌‌‌‌‌‌‌‌, లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లేమి ఇబ్బందిగా మారింది. 

 రెండో వన్డేలో రోహిత్‌‌‌‌‌‌‌‌ సెంచరీ సాధించడంతో చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ సన్నాహాలు ఓ కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి విరాట్‌‌‌‌‌‌‌‌ కూడా గాడిలో పడాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి కోహ్లీ పేవల ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేకపోయినా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోతున్నాడు. ఈ ఒక్క బలహీనతను అధిగమిస్తే  అతను గాడిలో పడి జట్టును ముందుకు తీసుకెళ్లగలడు.