వరల్డ్ కప్ ఫైనల్ కు తుది జట్టులో ఎవరుంటారు? సాధారణంగా సెమీ ఫైనల్లో గెలిచిన జట్టుతోనే ఫైనల్ కు వెళ్తుంది. వరుస విజయాలు సాధిస్తున్న జట్టులో జట్టు యాజమాన్యం, కెప్టెన్, కోచ్ ఎలాంటి మార్పులు చేయరు. కానీ టీమిండియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఎలాగైనా గెలవాలనే పట్టుదల మీద కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అనుభవాన్ని ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది.
ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించాలంటే స్పిన్ ను ఆయుధంగా వాడుకోవాలని ఆసీస్ భావిస్తుంది. దానికి తగ్గట్టే అహ్మదాబాద్ లో స్లో పిచ్ అనే టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే స్పిన్ కు ఈ పిచ్ అనుకూలిస్తుంది. దీంతో అశ్విన్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా అశ్విన్ కు ఆసీస్ మీద అద్భుతమైన రికార్డ్ ఉంది. ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేని సిరాజ్, సూర్య కుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి రావొచ్చు. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే సిరాజ్ పై వేటు పడొచ్చు. ఒకవేళ ఆరో బౌలర్ కావాలనుకుంటే సూర్య బెంచ్ కే పరిమితమవ్వాలి.
ఫైనల్ కు ముందు ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని భావిస్తే అశ్విన్ కు అవకాశం దక్కదు. మిగిలిన వారితో స్థానాలకు ఎలాంటి ముప్పు ఉండదు. మరోవైపు ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగొచ్చు. ఈ రోజు భారత్ టైటిల్ గెలిస్తే వరల్డ్ కప్ మూడు సార్లు గెలిచిన జట్టుగా నిలుస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ తుది సమరంలో గెలిస్తే 6 వ సారి విశ్వ విజేతగా అవతరిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. టీవీలో స్థార్ స్పోర్ట్స్, మొబైల్ లో డిస్నీ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు
#INDvsAUSFinal | वर्ल्ड कप 2023 के फाइनल में क्या रविचंद्रन अश्विन को मिलेगा मोहम्मद सिराज की जगह मौका? कमेंट कर बताइय अपनी राय #RavichandranAshwin #MohammedSiraj #NarendraModiStadium #Ahmedabad pic.twitter.com/AyM2ZqxRhM
— Zee Business (@ZeeBusiness) November 17, 2023