మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్(Miss Grand International 2024) టైటిల్ను భారత మహిళ దక్కించుకుంది. పంజాబ్కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా (Rachel Gupta) ప్రతిష్టాత్మక 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024' కిరీటాన్ని అందుకున్నారు.
బ్యాంకాక్‌లోని MGI హాల్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. రాచెల్ గ్రాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కు చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో రేచల్ 'గ్రాండ్ పీజెంట్ చాయిస్' అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు.
ALSO READ | ప్రేమ వివాహం చేసుకున్న నాగిని సీరియల్ నటి.. వరుడు ఎవరంటే.?
దేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ నమోదైంది. మిస్ గ్రాండ్ టైటిల్ గెలుచుకుని తొలిసారి ఓ చరిత్ర నమోదు చేసింది. ఈ విజయాన్ని రాచెల్ గుప్తాతన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. తనపై విశ్వాసం ఉంచిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రాచెల్.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు.
రాచెల్ 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్' టైటిల్ కూడా సాధించారు. అంతేకాదు ఇంస్టాగ్రామ్లో కూడా ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు (10 లక్షల మందికి పైగా). ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన రాచెల్ గ్లోబల్ అంబాసిడర్గా ప్రపంచ శాంతి స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు.