![ఐదు నెలల దిగువకు ఇన్‌ఫ్లేషన్](https://static.v6velugu.com/uploads/2025/02/indias-retail-inflation-falls-to-five-month-low-of-431-per-cent-in-january_3mV2JlQ1OE.jpg)
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్‌ఫ్లేషన్ కిందటి నెలలో ఐదు నెలల కనిష్టమైన 4.31 శాతానికి దిగొచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పుల ధరలు తగ్గడంతో ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. రిటైల్ ధరల పెరుగుదలను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) కిందటేడాది డిసెంబర్‌లో 5.22 శాతంగా, 2024 జనవరిలో 5.1 శాతంగా రికార్డయ్యింది. ఆహార పదార్ధాల ధరలను కొలిచే ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఈ ఏడాది జనవరిలో 6.02 శాతానికి దిగొచ్చింది.
కిందటేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో కొబ్బరి నూనె, బంగాళాదుంపలు, కొబ్బరికాయలు, వెల్లుల్లి ధరలు ఎక్కువగా పెరిగాయి. జీరా, అల్లం, ఎండు మిరప, వంకాయ, ఎల్‌పీజీ ధరలు తగ్గాయి. ఇదిలా ఉంటే, యూఎస్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అంచనాలకు మించి పెరిగింది. నెల ప్రాతిపదికన జనవరిలో 0.5 శాతం పెరిగింది. 0.3 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. యాన్యువల్ బేసిస్‌లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ 3 శాతంగా నమోదైంది.