Richest Female Singer: ఇండియాస్ రిచెస్ట్ ఫిమేల్ సింగర్ ఎవరో తెలుసా? ఆమె సంపాదన ఎన్ని వందల కోట్లంటే

Richest Female Singer: ఇండియాస్ రిచెస్ట్ ఫిమేల్ సింగర్ ఎవరో తెలుసా? ఆమె సంపాదన ఎన్ని వందల కోట్లంటే

ఇండియన్ సినిమా రంగంలో రిచ్చెస్ట్ హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు అనేది చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. కానీ, సినిమాలో అంతర్భాగంలో ఉన్న సింగర్స్ సంపాదన ఎంతనేది మాత్రం చాలా తక్కువసార్లు తెలుసుకుంటాం. ఎందుకంటే, హీరోల సంపాదన కోట్లలో, సింగర్స్ సంపాదన వేలలో ఉంటుంది కనుక. కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకుబోయేది ఒక్కోపాటకి లక్షల్లో తీసుకుంటూ.. కోట్లలో ఆస్తులు ఉన్న సింగర్స్ ఎవరనేది చూద్దాం. 

మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది నటి, గాయని తులసి కుమార్ (Tulsi Kumar) గురుంచి. ఈమె ఇండియాలోనే అతిపెద్ద చలనచిత్ర సంస్థ T-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమార్తె. తులసి కుమార్.. ఇండియాలో ఉన్న స్టార్ సింగర్స్ శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, ఆశా భోంస్లేల కంటే పెద్ద సింగర్ కాకపోయినప్పటికీ.. తన సంపాదనలో మాత్రం బాగా రిచ్. 

Also Read : దర్శకుడు సుకుమార్ కూతురు సినిమాల్లోకి

ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఉన్న సింగర్స్ లో.. తులసి కుమార్ సంపాదన రూ.200 కోట్లకు పైగా నికర విలువతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే, ఆమె సంపాదన కేవలం పాటలు పాడుతూనే కాకుండా.. తమ కుటుంబ వ్యాపార సంస్థలతో వచ్చే వాటా ద్వారా కూడా ఈ స్థాయికి చేరింది. అంతేకాకుండా, తాను అదనంగా.. 'కిడ్స్ హట్' అనే యూట్యూబ్ ఛానెల్‌ని కలిగి ఉంది. దీన్ని ద్వారా కూడా తాను సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పిల్లల కోసం నర్సరీ రైమ్స్ మరియు కథలు వంటి కంటెంట్‌ను అందించే దిశగా వెళుతుంది. అయితే, ఈమె సంపాదన కేవలం సింగర్స్ కంటే ఎక్కువని కాదు.. హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువే. 

తులసి సంగీత ప్రపంచం:

తులసి 2006లో చుప్ చుప్ కేలోని మౌసమ్ హై బడా ఖతీల్ పాటతో సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది. భూల్ భులయ్యా, రెడీ, దబాంగ్ మరియు కబీర్ సింగ్ వంటి చిత్రాలలో ఎన్నో హిట్ పాటలు పాడింది. ఎన్నో ప్రఖ్యాత అవార్డులను సైతం సొంతం చేసుకుంది. 

ఇతర సింగర్స్ సంపాదన చూసుకుంటే.. 

శ్రేయా ఘోషల్: రూ.180-185 కోట్లు  
సునిధి చౌహాన్: రూ.100-110 కోట్లు  
ఆశా భోంస్లే: రూ.80-100 కోట్లు

ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే..  క్షణం తీరికలకుండా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, మలయాళం ఇలా దాదాపు అన్ని భాషల్లో పాటలు పాడుతూ బిజీగా ఉంది. తాను ఒక్కో పాటకి ఏకంగా రూ.25 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంన్నట్టు టాక్. నిజానికి.. ఒక్కో పాటకి రూ.25 లక్షలు అంటే మాములు విషయం కాదు. అంతేకాదు.. ఆమె ఇప్పటివరకు నాలుగు సార్లు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ పై కూడా వచ్చిన విషయం తెలిసిందే. అలా ఆమె సెకండ్ ఇండియాస్ రిచెస్ట్ సింగర్ గా పేరు సంపాదించుకున్నారు.