- మ. 2.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
కొలంబో : మందకొడి పిచ్‌లపై లంక స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన టీమిండియా.. రెండో వన్డేకు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ పోరులో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. తొలి వన్డేలో 231 రన్స్‌ను ఛేజ్ చేయలేకపోయిన బ్యాటర్లు ఈ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. లంక స్పిన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ఫ్రంట్‌ఫుట్ వర్క్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని కోరుకుంటున్నారు.
అదే టైమ్‌లో అక్షర్, కుల్దీప్, సుందర్ స్పిన్‌ను.. లంక బ్యాటర్లు నిశాంక, దునిత్ బాగా ఆడారు. దీంతో గిల్‌తో కలిపి నలుగురు స్పిన్నర్లు 126 రన్స్ ఇచ్చారు. రెండో వన్డేలో దీన్ని నియంత్రించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే స్పిన్‌ను దీటుగా ఆడే రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌లో ఒకరికి చాన్స్ ఇస్తారేమో చూడాలి. ఇది మినహా మిగతా టీమ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మరోవైపు ఇండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో సూపర్ సక్సెస్ అయిన లంకేయులు కూడా గెలుపు పైనే దృష్టి పెట్టారు.
బ్యాటింగ్‌లో రాణించడం వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే హసరంగ ఫిట్‌నెస్‌పై కాస్త సందేహం నెలకొనడంతో తుది జట్టులోకి ఎవర్ని తీసుకోవాలన్న దానిపై చర్చ నడుస్తోంది. ఓవరాల్‌గా ఇరుజట్లు సిరీస్‌లో ఆధిక్యం కోసం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.