
న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌తో రికార్డు సృష్టించిన ఇండియా స్టార్ షూటర్ మను భాకర్ ఇప్పుడు ఆట నుంచి స్వల్ప విరామం తీసుకుంది. పిస్టల్‌ను పక్కనబెట్టి తనకు ఇష్టమైన గుర్రపుస్వారీ, స్కేటింగ్, భరతనాట్యంతో బిజీబిజీగా గడుపుతోంది. వీలైతే మార్షల్ ఆర్ట్స్‌ను కూడా నేర్చుకుంటానని చెబుతోంది. ‘చిన్నతనంలో మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉండేది. కానీ షూటింగ్‌లోకి వచ్చాక టైమ్ దొరకలేదు.
ఇప్పుడు లభించింది కాబట్టి మరోసారి ప్రయత్నిస్తా. అలాగే నా అభిరుచులను కూడా నెరవేర్చుకుంటా. గుర్రపు స్వారీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ రోడ్లపై స్కేటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది. ఫిట్‌నెస్ కోసం చేసే వాటిని బాగా ఎంజాయ్ చేస్తా. డ్యాన్స్ చేయడం కూడా నా హాబీ, భరత నాట్యం నేర్చుకుంటున్నా. వయోలిన్ వాయించడం కూడా ఇష్టమే’ అని భాకర్ చెప్పుకొచ్చింది.