బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నం.1 సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్లు సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్టి జోడీ.. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించారు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాత్విక్​–చిరాగ్​ రెండు స్థానాలు ఎగబాకి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరారు. దీంతో ఇండియా తరఫున డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అగ్రస్థానం దక్కించుకున్న తొలి జంటగా రికార్డు సృష్టించింది. ఫలితంగా లెజెండరీ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదుకోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైనా నెహ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరసన చోటు సంపాదించారు.

 ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గడం సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంట ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. 41 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగజారి 8వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా 15, 20వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు స్థానాలు ఎగబాకిన పీవీ సింధు 13వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.