తగ్గేదేలే: ఇండియాలో భారీగా పెరిగిన లగ్జరీ కార్ల సేల్స్

మనదేశంలో లగ్జరీ వస్తువుల వినియోగం బాగా పెరిగిపోతున్నది. మారుతున్న తరం.. మనస్తత్వం..హైఎండ్ కార్లను వైపు మళ్లుతోంది.  లంబోర్ఘిని, ఫెరారీ, మెక్ లారెన్, ఆస్టన్ మార్టిన్ వంటి బ్రాండ్ లనుంచి సూపర్ లగ్జరీ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. 

2023లో టాప్ ఎండ్ కార్ సెగ్మెంట్ లో అమ్మకాలు రెండింతలు పెరిగి 1000 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో 12 వందల నుంచి 13 వందల లగ్జరీ కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని కార్ల పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. 

కార్ల తయారీ ఇండస్ట్రీ రిపోర్టు ప్రకారం.. ఇటలీకి చెందిన లంబోర్ఘిని కార్ల కంపెనీ ఇండియాకు కేటాయించిన అన్ని కార్లను విక్రయించింది. ఈ కంపెనీకి చెందిన హుకారస్, ఉరుస్, రెవెల్టో వంటి కార్ల ధర రూ. 5 కోట్లనుంచి 10 కోట్ల వరకు ధర పలికింది. 

ఫెరారీ, మెక్ లారెన్, ఆస్టన్ వంటి లగ్జరీ బ్రాండ్ ల అమ్మకాలు కూడా పెరిగాయి. మెర్సిడెజ్ బెంజ్, ఆడీ నుంచి లగ్జరీ మోడల్ లు ఒక సంవత్సరం వరకు బుకింగ్ చేయబడ్డాయి. వాటి ధర రూ. 2.5 కోట్లనుంచి రూ. 4.5 కోట్లు వరకు ఉన్నాయి. 

ALSO READ | హీరో గ్లామర్ 2024 ను లాంచ్​ చేసిన రామ్​చరణ్

ఆస్టన్ మార్టిన్ ఇటీవల భారత్ లో కొత్త స్పోర్ట్ కారు వాంటెజ్ ని విడుదల చేసింది. దీని ధర కూ. 3.99 కోట్లు. ఆటోమేకర ఆస్టన్ మార్టిన్ ప్రకారం.. ఇది లెజెండరీ వన్ 77 సూపర్ కార్ నుంచి ప్రేరణగా డిజైన్, షేప్ లతో అద్భుతమైన , ఆకర్షణీయమైన లుక్ తో వస్తుంది. 

ఇక BMW  ఇండియా గ్రూప్ కూడా జనవరి నుంచి జూన్ లో మంచి అమ్మకాలను కలిగి ఉంది. ఈ కంపెనీకి చెందిన యాక్టివిటీ వెహికల్స్, లగ్జరీ క్లాస్, ఎలక్ట్రికట్ కార్లకు అధిక డిమాండ్ తో కార్ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. BMW   లగ్జరీ క్లాస్ వెహికల్స్ 17 శాతం వృద్దిని నమోదు చేసుకున్నాయి. మొత్తం అమ్మకాలలో 18 శాతం వాటి కలిగి ఉన్నాయి.లగ్జరీ కార్ల మోడల్ లో BMW X7 అత్యధికంగా అమ్ముడైన కారు. 

భారత్ లో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా ఇటీవల తన బోల్డ్ ఎడిషన్ కింద రెండు కొత్త కార్లను విడుదల చేసింది. Q3, Q3 స్పోర్ట్స్ బ్యాక్ కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది.