కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. డ్రా ఖాయమన్న మ్యాచ్ లో అసాధారణంగా పోరాడుతుంది. బౌలింగ్ లో.. బ్యాటింగ్ లో దూకుడు చూపిస్తూ ఫలితం వచ్చేలా చేస్తుంది. మొదట బౌలింగ్ లో బంగ్లాను త్వరగా ఆలౌట్ చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్ లో చెలరేగి 34.4 ఓవర్లకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.
ఓపెనర్ షాదాబ్ ఇస్లాం (7) మోమినుల్ హక్ క్రీజ్ లో ఉన్నారు. జాకీర్ హుస్సేన్ (10), నైట్ వాచ్ మెన్ హసన్ మహమ్మద్ (0) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. చివరి రోజు మొత్తం 98 ఓవర్ల ఆట మిగిలి ఉంది. భారత్ బంగ్లాను త్వరగా ఆలౌట్ చేస్తే విజయం సాధించవచ్చు. ఈ ఒక్క రోజు 85 ఓవర్లలో 437 పరుగులు రావడంతో పాటు 18 వికెట్లు పడ్డాయి.
ALSO READ | IND vs BAN 2nd Test: 34.4 ఓవర్లకే భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్.. రసవత్తరంగా కాన్పూర్ టెస్ట్
అంతకముందు దూకుడుగా ఆడి భారత్ 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యం లభించింది. 51 బంతుల్లోనే 72 పరుగులు చేసి జైశ్వాల్ టాప్ స్కోరర్ గా 51 బంతుల్లోనే 72 పరుగులు చేసి జైశ్వాల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ 68 పరుగులు చేసి భారత్ కు వేగంగా ఆధిక్యాన్ని అందించాడు. కోహ్లీ (47), గిల్ (39) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ తలో నాలుగు వికెట్లు తీసుకున్నారు.
107/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా మరో 126 పరుగులు మాత్రమే జోడించగలిగింది. మమినుల్ హక్(107*) ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు. సహచర బ్యాటర్లు వీడుతున్నా.. మరో ఎండ్‌లో తాను మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు. 194 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులతో నౌటౌట్‌గా నిలిచాడు.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3.. సిరాజ్, అశ్విన్, ఆకాష్ దీప్ త్రయం రెండేసి వికెట్లు పడగొట్టారు.
Can India force a result out of this game on day 5?#INDvBAN https://t.co/0yfwSVVhMp pic.twitter.com/YDgv0fg5YN
— ESPNcricinfo (@ESPNcricinfo) September 30, 2024