వంటకాల్లో భారతదేశం బెస్ట్ అని మనందరికి తెలుసు.. భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. వంటకాలపై ఏకంగా పెద్దపెద్ద బుక్కు లే రాశారు మనవాళ్లు. వంటకాల పోటీలు పెట్టినప్పుడు భారతీయ వంటకాలు ప్రపంచంలోనే టాప్ 10 తప్పనిసరిగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. అయితే ఏవీ బెటర్, బెస్ట్ అని ప్రశ్న వచ్చినప్పుడు.. సమాధానం కొంచెం కష్టమే.
ఫుడ్ డెలివరీ దిగ్గజం Swiggy ..ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. Swiggy ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ఏమేం ఆర్డర్ చేశారు.. ఏ వంటకాలు ఎక్కు వగా ఆర్డర్ చేశారు.. అత్యధికంగా, ఎక్కువమంది ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటీ.. ఇలా రకరకాల ప్రశ్నలకు ఈ సర్వే ద్వారా దొరికింది.. అవేంటో తెలుసుకుందాం రండి..
దేశంలోని టాప్ వంటకాలపై స్విగ్గి సర్వే నిర్వహించింది. స్విగ్గీ రోజువారీగా డెలివరీ చేస్తున్న వంటకాల్లో 90 శాతం పైగా వెజ్ వంటకాలే ఉన్నాయట.. ఇందులో బ్రేక్ ఫాస్ట్ సంబంధించిన ఆర్డర్లు అత్యధికంగా ఉన్నాయి. దక్షిణ భారత వంటకాలైన మసాలా దోష, వడ, ఇడ్లీ, పొంగల్ ఉన్నాయి. మసాలా దోస భారతీయుల హృదయాలను దోచుకుంది. ఇది కేవలం అల్పాహారం కోసమే కాకుండు లంచ్, డిన్నర్ లో కూడా ఇది ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని స్విగ్గి సర్వేలు చెబుతున్నాయి.
అంతేకాదు స్విగ్గీ వారానికి 60వేల వెజ్ సలాడ ఆర్డర్లను చూస్తుంది. ఇందులో గ్రీన్ సలాడ్ ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటున్నారు. గతేడాది ఆర్డర్లతో పోల్చితే వెజ్ ఆర్డర్లు 146 శాతం పెరిగాయని స్విగ్గి చెపుతోంది.
దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆర్డర్ చేయబడిన టాప్ 10 వంటకాల్లో ఆరు శాఖాహారం వంటకాలున్నాయి. స్విగ్గీ సర్వే ప్రకారం.. వెజ్జీవ్యాలీ గా పిలువబడే బెంగళూరులో ఎక్కువగా వెజ్ వంటకాలను ఆర్డర్ చేశారు. బెంగళూరు వాసులు ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల్లో మసాలా దోస, పనీర్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా ఉన్నాయి. ముంబైలో అయితే దాల్ ఖిచ్డీ, పావ్ భాజీ, పిజ్జా ఎక్కువగా ఆర్డర్ చేశారు. ఇక హైదరాబాద్ లో అయితే మసాలా దోష, ఇడ్లీలు బాగా తిన్నారట హైదరాబాదీలు.