Goli Soda:గోలిసోడా హవా..అమెరికా, యూరప్లో మస్తు డిమాండ్

Goli Soda:గోలిసోడా హవా..అమెరికా, యూరప్లో మస్తు డిమాండ్

గోలిసోడా..ఈ పానియం గురించి తెలియనివారుండరు. ఒకప్పుడు ఎక్కడ చూసిన ఇదే కనిపించేది. ముఖ్యంగా ఎండాకాలంలో దాహం తీర్చుకునేందుకు ఎక్కువగా గోలి సోడాను తాగేవారు. ప్రధాన సిటీలు, పట్టణాలు, టౌన్లలో బస్టాండ్లు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ గోలి సోడా దొరికేది..కాలక్రమేణా ఇది కనుమరుగైపోయింది.అయితే గోలిసోాడా మళ్లీ తిరిగి పునరాగమనం చేస్తోంది. ప్రపంచం మార్కెట్లో గోలిసోడాకు పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. అమెరికా, యుకె, యూరప్ ,గల్ఫ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లలో మస్తు డిమాండ్ ఉంది. గోలి సోడాను కొద్దిగా అటుఇటు మార్పులతో వివిధ దేశాల్లో గోలిసోడాను తెగ తాగేస్తున్నారట. 

పాతకాలం డ్రింక్ అయిన ఈ చల్లని పులుపు, ఉప్పు మిశ్రమ టేస్టీ పానియానికి మళ్లీ ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, యుకె, యూరప్ ,గల్ఫ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లలో మస్తు డిమాండ్ ఉంది. గోలి పాప్ సోడా బ్రాండ్ తో భారతీయ గోలిసోడాను ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా, యుకె, యూరప్,గల్ఫ్ దేశాలకు విజయవంతమైన ట్రయల్ షిప్‌మెంట్‌ల తర్వాత భారతదేశ సాంప్రదాయ గోలిసోడాకు ప్రపంచ మార్కెట్లో డిమాండును సూచిస్తుందని  ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది. 

ALSO READ | బెంగళూరులో కుప్పకూలిన 120 అడుగుల రధం.. ఒకరు మృతి

ప్రపంచ వ్యాప్తంగా కుప్పుకుప్పలుగా పుట్టుకొచ్చిన బేవరేజ్ కంపెనీల తాకిడికి కనుమరుగైన గోలి సోడా పెరుగుతున్న డిమాండ్ స్వదేశీ ఆహారం, పానియాల ఉత్పత్తి, ఎగుమతికి భారత్ చేస్తు్న్న ప్రయత్నాల్లో ఓ ముఖ్యమైన మైలురాయిగా సూచించింది. గల్ఫ్ లో అతిపెద్ద రిటైల్ మార్కెట్ అయిన లులు హైపర్ మార్కెట్ స్టోర్లలో ఎక్కడ చూసినా గోలిపాప్ సోడా నిల్వలు కనిపిస్తున్నాయి. ఇది గోలిసోడాకు పెరుగుతున్న డిమాండ్ కు సూచిక అని  తెలిపింది. యూకెలో కూడా గోలిపాప్ సోడా వేగంగా ప్రజాదరణ పొందింది. 

ప్రపంచ మార్కెట్లలో గోలి పాప్ సోడాకు పెరుగుతున్న ఆదరణ స్వదేశీ రుచులు అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీ పడగలవని రుజువు చేస్తుందని, భారతీయ ఎగుమతులకు కొత్త మార్గాలను తెరుస్తుందని ,ప్రపంచ ఆహార పానీయాల రంగంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది.