
న్యూఢిల్లీ: హోల్‌సేల్ ధరల పెరుగుదలను కొలిచే హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.38 శాతానికి చేరుకుంది. వంట నూనె, కూల్‌డ్రింకులు వంటి మాన్యుఫాక్చరింగ్ ఫుడ్ ఐటెమ్స్ ధరలు పెరగడంతో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ కొద్దిగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో డబ్ల్యూపీఐ 2.31 శాతంగా, కిందటేడాది ఫిబ్రవరిలో 0.2 శాతంగా నమోదైంది. వరుసగా మూడు నెలల పాటు హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గగా, ఫిబ్రవరిలో పెరిగింది.
బంగాళాదుంపలు, పాల హోల్‌సేల్ ధరలు తగ్గగా, పండ్లు, ఉల్లిపాయల ధరలు మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇంధనం, పవర్ ధరలు ఈ ఏడాది ఫిబ్రవరిలో తగ్గాయి. కాగా, రిటైల్ ధరల పెరుగుదలను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) కిందటి నెలలో 7 నెలల కనిష్టమైన 3.61 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే.