
న్యూఢిల్లీ: ఇండియా యంగ్‌స్టర్ ప్రణవ్ వెంకటేశ్ వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్ (అండర్ 20)గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్‌గా రికార్డుకెక్కాడు. మోంటెనెగ్రో దేశంలోని పెట్రోవాక్‌లోశుక్రవారం జరిగిన చివరి, 11వ రౌండ్‌లో స్లొవేనియాకు చెందిన మాటిక్ లావ్రెన్సిక్‌తో గేమ్‌ను 18 ఎత్తుల్లోనే డ్రా చేసుకొని టైటిల్ నెగ్గాడు.
టోర్నీలో మొత్తంగా ఏడు విజయాలు, నాలుగు డ్రాలతో 11 పాయింట్లకు గాను అత్యధికంగా 9 పాయింట్లు కైవసం చేసుకున్నాడు. గతేడాది చెన్నై ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచిన 17 ఏండ్ల ప్రణవ్ ఇండియా చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్‌కు చెందిన వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. 1987లో ఇదే టోర్నీలో టైటిల్ నెగ్గిన ఆనంద్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు.
ఆ తర్వాత హరికృష్ణ (2004), అభిజీత్ గుప్తా (2008) కూడా వరల్డ్ జూనియర్ చాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రణవ్ ఈ టైటిల్ గెలిచాడు.