పారా వీరులపై కనక వర్షం

పారా వీరులపై కనక వర్షం
  •     స్వర్ణానికి రూ. 75 లక్షలు, రజతానికి 50 లక్షలు
  •     అందజేసిన కేంద్ర క్రీడా మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ : పారిస్ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకాలు నెగ్గిన ఇండియా క్రీడాకారులపై కనక వర్షం కురిసింది.  స్వర్ణ పతకానికి రూ. రూ.75 లక్షలు, రజతానికి రూ. 50 లక్షలు, కాంస్యానికి రూ. 30 లక్షల చొప్పున నగదు పురస్కారాలను ఆయా అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం అందజేశారు. రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కాంస్యం సాధించిన ఆర్చర్ శీతల్ దేవి వంటి ప్లేయర్లకు  రూ. 22.5 లక్షల నగదు లభించింది.  

పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతక విజేతలతో పాటు పాల్గొన్న ఇతర క్రీడాకారులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాండవీయ మెడలిస్టులకు చెక్కులను అందజేశారు. 2028 లాస్ ఏంజెల్స్ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరిన్ని పతకాలు సాధించాలనే లక్ష్యంతో పారా-అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుచ్చి, అవసరమైన
సౌకర్యాలు కల్పిస్తుందని మాండవీయ హామీ ఇచ్చారు.  

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఏడు స్వర్ణాలు సహా రికార్డు స్థాయిలో 29 మెడల్స్ సాధించింది. కాగా,  పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి  తిరిగొచ్చిన పారా మెడలిస్టులకు ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో వందలాది మంది అభిమానులు, క్రీడా శాఖ అధికారులు స్వాగతం పలికారు. వారికి పూల మాలలు వేసి, స్వీట్లు తినిపించారు.