దేశ చరిత్రలో తొలిసారి భారీగా డ్రగ్స్ ధ్వంసం చేశారు పోలీసులు. అండమాన్ నికోబర్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ లో 6వేల కిలోల మత్తు పదార్థాలు దహనం చేశారు. వీటి విలువ 36వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు అధికారులు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అనుమతితో ధ్వంసం చేసినట్లు తెలిపారు. .
జనవరి 11న న్యూఢిల్లీలో డ్రగ్ ట్రాఫికింగ్, జాతీయ భద్రతపై ప్రాంతీయ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన అమిత్ షా.. డ్రగ్స్ రహిత భారత్ ఎన్డీఏ సర్కార్ లక్ష్యమని అన్నారు.డ్రగ్స్ పై పోరాటంలో మోదీ సర్కార్ విజయం సాధించిందని చెప్పారు. పదేళ్లలో 24 లక్షల కిలోల డ్రగ్స్ పట్టుకున్నామని తెలిపారు. మత్తు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమిత్ షా.