ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ తమ జట్టును ఎంపిక చేయగా.. మిగిలిన 7 దేశాలు తమ స్క్వాడ్ ను ప్రకటించాల్సి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే భారత జట్టుపై ఒక క్లారిటీ వచ్చేసింది. టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును జనవరి 12 ప్రకటించనున్నారు. కెప్టెన్ గా ఓపెనర్ గా రోహిత్ శర్మ కొనసాగడం దాదాపుగా ఖాయం. శుభ్‌మాన్ గిల్ రోహిత్‌తో పాటు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్ గా ఎంపిక కానున్నడని సమాచారం. మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. 2023 ప్రపంచ కప్ వీరు ముగ్గురూ 500 పైగా పరుగులు చేశారు. వీరికి బ్యాకప్ గా రిషబ్ పంత్ కు అవకాశం దక్కొచ్చు.
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల రూపంలో ఆల్ రౌండర్లుగా కొనసాగవచ్చు. వీరికి బ్యాకప్ గా అక్షర్ పటేల్, సుందర్ ఎంపికయ్యే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోనున్నాడు. ఈ టోర్నీకి వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహమ్మద్ షమీ ఫిట్ నెస్ సాధిస్తే ఎంపిక చేయడానికి సెలక్టర్లు సిద్ధంగా ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఫాస్ట్ బౌలర్లుగా సెలక్ట్ కానున్నారు.
Also Read :- కోహ్లీ, రోహిత్ లపై మాజీ హెడ్ కోచ్ ఫైర్
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనున్నట్లు క్రిక్‍ఇన్ఫో నివేదించింది. భారత్, పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగానే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా నాకౌట్ దశకు అర్హత సాధిస్తే.. యూఏఈలోనే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ పటేల్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ