Team India: 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే

Team India: 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉంది. సిరీస్ లో మూడు టెస్ట్ మ్యాచ్ లు ముగిసాయి. మరో రెండో టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 2023-25 టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ఈ సిరీస్ తర్వాత భారత్  2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ ను ప్రారంభిస్తుంది. రానున్న రెండు సంవత్సరాలకు భారత టెస్ట్ షెడ్యూల్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. 

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లపై భారత్ సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. అదే విధంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో విదేశాల్లో టెస్ట్ సిరీస్ లు జరగనున్నాయి. మొదటగా 2025 లో వెస్టిండీస్ తో అక్టోబర్ లో.. ఆ తర్వాత నవంబర్ లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై సిరీస్ ఆడనుంది. 2026 చివర్లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ వేదికగా ఆడే అవకాశం ఉంది. విదేశాల్లో ఇంగ్లాండ్ తో జూలై, ఆగస్టు నెలలో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. 2026 ప్రారంభంలో న్యూజిలాండ్ తో.. 2026 జూలై లో శ్రీలంకతో సిరీస్ ఆడే అవకాశాలు ఉన్నాయి. 

ALSO READ : Ashwin : అశ్విన్ మైండ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌.. మ్యాచ్‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌

పూర్తి షెడ్యూల్ బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్ షిప్ విషయానికి వస్తే భారత్ ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లు గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది. లేకపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే సౌతాఫ్రికా పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియాతో డిసెంబర్ 26 న మెల్ బోర్న్ వేదికగా భారత్ నాలుగో టెస్ట్ ఆడనుంది.