పశ్చిమ నౌకాదళంలో ఐఎన్​ఎస్​ విక్రాంత్​

పశ్చిమ నౌకాదళంలో ఐఎన్​ఎస్​ విక్రాంత్​

అరేబియా సముద్రంలో భద్రతను మరింత పెంచేందుకు విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​ పశ్చిమ నౌకాదళంలోకి చేరింది. ఇప్పటికే అరేబియా సముద్రంలో సేవలందిస్తున్న ఐఎన్​ఎస్ విక్రమాదిత్యతో కలిసి కార్యకలాపాలు నిర్వహించనున్నది. ఈ రెండు విమాన వాహక నౌకలు కలిసి భారతదేశ తీర ప్రాంతాన్ని రక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అరేబియా సముద్రంలో ఈ రెండు నౌకలు భారతదేశ సముద్ర శక్తిని ప్రదర్శిస్తాయి. 

ఐఎన్​ఎస్ విక్రాంత్​ను ఇండియన్​ నేవీ ఇన్​హౌస్​ డైరెక్టరేట్​ ఆఫ్ నేవల్​ డిజైన్​(డీఎన్​డీ) రూపొందించింది. కొచ్చిన షిప్​యార్డ్​ లిమిటెడ్​ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కలిగిన ఐఎన్​ఎస్​ విక్రాంత్​ 28 నాట్ల వేగంతో 7500 నాటికల్​ మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. 

  • మొదటి ఐఎన్​ఎస్​ విక్రాంత్​ 1961 నుంచి 1997 వరకు సేవలందించింది. దీనిని బ్రిటన్​ను కొనుగోలు చేశారు. 
  • ఐఎన్ఎస్ విరాట్​ 1987 నుంచి 2016 వరకు సేవలందించింది. దీనిని బ్రిటన్ నుంచి కొనుగోలు చేశారు. 
  • రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్​ఎస్ విక్రమాదిత్య 2013 నుంచి సేవలందిస్తున్నది. 
  • స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్​ఎస్​ విక్రాంత్​ నాలుగో విమాన వాహక నౌక. 
  • ఇది భారతదేశపు తొలి విమాన వాహక నౌక.