స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిస్సైల్ ( ITCM) ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చండీపూర్ లోఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి స్వదేశీ టెక్నాలజీని మిస్సైల్ ను బుధవారం(ఏప్రిల్ 18) సక్సెస్ ఫుల్ పరీక్షించింది.ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకిం గ్ సిస్టమ్ (EOTS), టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్ ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షించారు. ఈ క్షిపణిని భారత వైమానిక దళానికి చెందిన SU -30-Mk-I విమానం నుంచి కూడా పర్యవేక్షించారు.
మెరుగైన, విశ్వసనీయ పనితీరును నిర్ధారించడానికి క్షిపణిలో అధునాతన ఏవియానిక్స్, సాఫ్ట్ వేర్లు ఏర్పాటు చేశారు. ఈ క్షిపణీని బెంగళూరులోని DRDO ప్రయోగ శా ల ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ADE) అభివృద్ది చేసింది.
స్వదేశీ ప్రొపల్షన్ తో నడిచే స్వదేశీ లంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ DRDO సి బ్బంది అభినందనలు తెలిపారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం భారత రక్షణ రంగంలో ఓ ప్రధాన మైలురాయి అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ITCM ప్రయో గాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ శాఖ కార్యదర్శి, DRDO చైర్మన్,బృందాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.